Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics: ఫ్రాన్స్-అర్జెంటీనా పోరు రచ్చరచ్చ..గొడవపడిన ప్లేయర్లు (Video)

పారిస్ ఒలింపిక్స్-2024లో అర్జెంటీనాపై ఫ్రాన్స్ 1-0తో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు గొప్పగా ఆడింది. అద్భుతమైన ఆట తీరుతో పటిష్టమైన అర్జెంటీనాను క్వార్టర్స్‌లోనే ఇంటికి పంపింది.

అయితే మ్యాచ్ అనంతరం మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్రాన్స్-అర్జెంటీనా ఆటగాళ్లు గొడవ పడ్డారు. గొడవ సద్ధుమణిగించడానికి ఎంత ప్రయత్నించినా ఇరు జట్లు ఆటగాళ్లు తగ్గలేదు. ఒకరిపైనొకరు దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Paris Olympics Football Argentina and France Players Clash in Ugly Post-Match Fight

సొంతగడ్డపై సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లడంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే అదే సమయంలో అర్జెంటీనా కోచ్, ప్రత్యామ్నాయ ఆటగాళ్లు మైదానంలోకి ప్రవేశించారు. ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రెంచ్ ఆటగాళ్లతో అర్జెంటీనా ప్లేయర్లు గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త పెద్దగా మారింది. తమ సెలబ్రేషన్స్‌ను చూసి అర్జెంటీనా ఆటగాళ్లు వాగ్వాదానికి దిగడంపై ఫ్రాన్స్ కోచ్, కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Paris Olympics Football Argentina and France Players Clash in Ugly Post-Match Fight

కాగా, మరోక్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌పై స్పెయిన్ 3-0తో విజయం సాధించింది. ఆగష్టు 5నుంచి సెమీఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. సోమవారం జరగనున్న తొలి సెమీస్‌లో మొరాకో‌తో స్పెయిన్ తలపడనుంది. మంగళవారం జరగనున్న సెమీఫైనల్‌లో ఫ్రాన్స్-ఈజిప్ట్ తలపడనున్నాయి. గురువారం కాంస్య పతక పోరు జరగనుంది. ఆగష్టు 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Story first published: Saturday, August 3, 2024, 13:19 [IST]
Other articles published on Aug 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+