Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్లోవేకియాపై పరాగ్వే విజయం, నాకౌట్ కు చేరువ

Enrique Vera
బ్లోమ్ ఫంటీన్: ఫుట్ బాల్ ఆటవరకు అంతగా చరిత్రలేని పరాగ్వే స్లొవేకియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇటలీని డ్రాగా నిలువరించిన పరాగ్వే మరో అడుగు ముందుకేసింది. ఆదివారం గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌ లో 2-0తో స్లొవేకియాను ఓడించింది. వెరా (27వ నిమిషం), రివెరాస్‌ (86వ) జట్టును గెలిపించారు. తాజా విజయంతో పరాగ్వే నాకౌట్‌ దశకు చేరువైంది. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌లో కనీసం డ్రా చేసుకున్నా రెండో రౌండ్‌ చేరుతుంది. మరోవైపు స్లొవేకియా ముందుకెళ్లాలంటే మాత్రం తన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీని చిత్తుగా ఓడించాల్సిందే.

ర్యాంకింగ్స్‌లో దగ్గరగా ఉన్న పరాగ్వే (31), స్లొవేకియా (34) మధ్య పోరు హోరాహోరీ ఖాయమనిపించింది! కానీ కొన్ని నిమిషాలకే తేలిపోయింది పరాగ్వేను అడ్డుకోవడం స్లొవేకియాకు కష్టమేనని. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇటలీని నిలువరించిన ఊపులో ఉన్న పరాగ్వే.. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై వరుస దాడులు చేసింది. మూడో నిమిషంలోనే గోల్‌ చేసేలా కనిపించింది. ఐతే రోక్‌ సాంటాక్రజ్‌ చేసిన గోల్‌ ప్రయత్నాన్ని గోల్‌ కీపర్‌ ముచా సమర్థంగా తిప్పికొట్టాడు. తర్వాత పరాగ్వే మరింత చెలరేగిపోయింది. స్త్ట్రెకర్లు రివెరాస్‌, బరియోస్‌ స్లొవేకియా రక్షణశ్రేణిని ఒత్తిడిలోకి నెట్టారు. 19వ నిమిషంలో 20 గజాల దూరం నుంచి రివెరాస్‌ కొట్టిన షాట్‌ నేరుగా ముచా చేతుల్లో పడింది. ఐతే పరాగ్వే ఆధిక్యం సాధించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 27వ నిమిషంలో పౌలో ద సిల్వ స్లొవేకియా డిఫెన్స్‌ ఛేదించుకుంటూ బంతిని వెరాకు అందించగా.. అతడు దాన్ని నెట్లోకి పంపాడు.

పట్టువదలని పరాగ్వే: ప్రథమార్ధంలో ఆత్మరక్షణలో పడిన స్లొవేకియా ద్వితీయార్ధంలో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ పరాగ్వే డిఫెండర్లు ఆ జట్టుకు ఎలాంటి అవకాశమివ్వలేదు. బంతి ఎక్కువసేపు స్లొవేకియా నియంత్రణలోనే ఉన్నా..ఆ జట్టు గోల్‌ ప్రయత్నాలు చేసింది తక్కువే. మరోవైపు పరాగ్వే జోరు ఏ మాత్రం తగ్గలేదు. 72వ నిమిషంలో వెరా జట్టుకు రెండో గోల్‌ అందించినంత పనిచేశాడు. అతడి హెడర్‌ గోల్‌పోస్ట్‌ సమీపం నుంచి వెళ్లింది. మ్యాచ్‌ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా పరాగ్వే ఆధిక్యం 2-0కు పెరిగింది. డి ప్రాంతం అంచు నుంచి రివెరాస్‌ గోల్‌ చేశాడు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+