Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ పై పరాగ్వే చారిత్రక విజయం

Oscar Cardozo
ప్రిటోరియా: జపాన్ పై నెగ్గి పరాగ్వే చరిత్ర సృష్టించింది. పెనాల్టీ షూటౌట్లో డిఫెండర్‌ యుచి కొమానో స్పాట్‌ కిక్‌ వెంట్రుకవాసిలో గురితప్పడంతో జపాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ప్రి క్వార్టర్స్‌లో పరాగ్వే షూటౌట్లో 5-3తో జపాన్‌ ను ఓడించింది. రెండు జట్లు పట్టుదలగా ఆడడంతో నిర్ణీత సమయంలోనూ, అదనపు సమయంలోనూ గోల్స్‌ నమోదు కాలేదు. ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ తప్పలేదు. తొలి (మొదటి కిక్‌ పరాగ్వేది) రెండు కిక్‌ లు సవ్యంగానే సాగాయి.

పరాగ్వే తరఫున బారెటో, లుకాస్‌.. జపాన్‌ తరఫున ఎండో, హసెబె విజయవంతంగా గోల్‌కీపర్లను బోల్తా కొట్టించారు. మూడో కిక్‌ను రివరోస్‌ సద్వినియోగం చేయడంతో పరాగ్వే 3-2 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాతే మలుపు. ఒత్తిడికి లోనైన కొమానో తడబడ్డాడు. అతడి షాట్‌ క్రాస్‌ బార్‌ను తగిలింది. జపాన్‌కు షాక్‌. సంబరాల్లో పరాగ్వే! తర్వాత వాల్డెజ్‌ (పరాగ్వే), హోండా (జపాన్‌) ఎలాంటి పొరపాటు చేయలేదు. పరాగ్వే ఐదో కిక్‌. జపాన్‌ కోరుకున్నట్లు అద్భుతమేమీ జరగలేదు. కార్డొజో అలవోకగా గోల్‌ కొట్టాడు. ఈ మ్యాచ్‌ గెలిస్తే జపాన్‌ తొ సారి క్వార్టర్స్‌ చేరేది. హోండాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

బంతిపై పెత్తనం పరాగ్వేదే కానీ..: గోల్స్‌ కాకున్నా ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. బంతిని ఎక్కువసేపు నియంత్రణలో ఉంచుకున్న పరాగ్వే దూకుడుగా ఆడింది. అవకాశాలు సృష్టించుకుంది. కానీ గోల్‌ కొట్టలేకపోయింది. జపాన్‌ గోల్‌కీపర్‌ కవషిమ సమర్థత కూడా అందుకు కారణం. జపాన్‌ కూడా తక్కువేమీ తినలేదు. బంతిని తక్కువసేపే నియంత్రణలో ఉంచుకున్నా ఎక్కువగా ఎటాక్‌ చేసింది. పలుసార్లు పరాగ్వే డిఫెన్స్‌ను ఛేదించింది. కానీ షాట్లు గురితప్పాయి.

ఆరో నిమిషంలో సాంతా క్రజ్‌ (పరాగ్వే) జపాన్‌ బాక్స్‌లోకి చక్కని క్రాస్‌ ఇచ్చాడు. కానీ ఎడ్గర్‌ బెనిటెజ్‌ బంతిని తలతో కొట్టగా అది దూరంగా వెళ్లింది. 21వ నిమిషంలో స్త్ట్రెకర్‌ లుకాస్‌ బరియోస్‌ పరాగ్వేకు ఆధిక్యాన్నిచ్చినంత పనిచేశాడు. కానీ జపాన్‌ డిఫెన్స్‌లోకి చొచ్చుకుపోయిన బరియోస్‌.. బంతిని నేరుగా కవషిమ చేతుల్లోకి తన్నాడు. తర్వాతి నిమిషంలో దైసుకె మసుయ్‌ (జపాన్‌) దూరం నుంచి కొట్టిన షాట్‌ పరాగ్వే క్రాస్‌బార్‌ను తగిలింది. 29వ నిమిషంలో మరో చక్కని అవకాశాన్ని పరాగ్వే వృథా చేసుకుంది.

జపాన్‌ గోల్‌పోస్ట్‌కు అతి సమీపంగా వచ్చిన సాంతా క్రజ్‌ బంతిని ఎడమకాలితో తన్నాడు. కానీ అది చాలా దూరంగా వెళ్లింది. మరో ఐదు నిమిషాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా 20 గజాల దూరం నుంచి షాట్‌ కొట్టిన హోండా (జపాన్‌) బంతిని లక్ష్యానికి చేర్చలేకపోయాడు. రెండో అర్ధభాగంలోనూ అదే పరిస్థితి. రెండు జట్లూ హోరా హోరీ తలపడ్డాయి. అనేక అవకాశాలు సృష్టించుకున్నా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. రెండు జట్లు డిఫెన్స్‌లో బలంగా ఉండటం, జాగ్రత్తగా ఆడటంతో గోల్స్‌ కాలేదు. బంతిని నియంత్రణలో ఉంచుకోవడానికి జపాన్‌ ఇబ్బందిపడ్డా పరాగ్వేకు అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీసింది. కానీ అక్కడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. చివరికి పెనాల్టీ షూటౌట్‌ తప్పలేదు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+