Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇటలీకి ఘోర అవమానం: వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాలేదు

Paolo Cannavaro in scathing attack after Italy World Cup failure

హైదరాబాద్: ఇటలీకి ఇంతకన్నా ఘోర అవమానం మరొకటి ఉండదేమో. నాలుగుసార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆ జట్టు 2018 వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇటలీకి ఇలా జరగడం 1958 తర్వాత ఇదే తొలిసారి. స్వీడన్‌తో జరిగిన చివరి ప్లే ఆఫ్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకోవడంతో ఇటలీ అర్హత సాధించలేకపోయింది.

మరోవైపు ఇటలీపై ఒక మ్యాచ్‌లో గెలిచిన స్వీడన్ వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది. 2006 తర్వాత వరల్డ్‌కప్‌లో ఆడటం స్వీడన్‌కు ఇదే తొలిసారి. తొలిసారి 1934లో విశ్వ విజేతగా నిలిచిన ఇటలీ.. ఆ తర్వాత 1938, 1982, 2006లలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో ఛాంపియన్‌గా అవతరించింది.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతిపై ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. గోల్ చేయడంలో మాత్రం విఫలమైంది. ఈ ఓటమితో 39 ఏళ్ల చాంపియన్ గోల్ కీపర్ గియాన్‌లూగి బఫన్ కెరీర్ కూడా ముగిసింది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌తో వీడ్కోలు పలుకుతానని ఇంతకుముందే బఫన్ ప్రకటించాడు.

దీంతో అతడికి ఆరో వరల్డ్ కప్ ఆడే అవకాశం లేకపోయింది. ఇటలీ తరఫున 175 మ్యాచ్‌ల్లో బఫన్ ప్రాతినిధ్యం వహించాడు. 2006లో వరల్డ్‌కప్ గెలిచిన ఇటలీ జట్టులో కూడా బఫన్ సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 15:33 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+