
మ్యాచ్ బాల్‌కు 'టెల్‌స్టార్ 18' గా నామకరణం
అయితే, ఈసారి వరల్డ్ కప్ కోసం తయారు చేసిన మ్యాచ్ బాల్‌కు 'టెల్‌స్టార్ 18' గా పేరు పెట్టింది. 1970 నుంచి ప్రపంచకప్ కోసం అడిడాస్ సంస్థ బంతులను తయారుచేస్తోంది. ఆ సంస్థ ప్రపంచకప్ కోసం తొలిసారిగా తయారుచేసిన బంతికి ‘టెల్‌స్టార్' అని పేరు పెట్టింది. దాని కొనసాగింపుగా 2018 సంవత్సరాన్ని సూచిస్తూ ప్రస్తుత టోర్నీలో వాడే బంతికి ‘టెల్‌స్టార్ 18' అని పేరు పెట్టారు.

పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో బాల్ తయారీ
ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో వాడబోయే బంతులను పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో తయారు చేయడం విశేషం. గతంలో బ్రెజిల్‌లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సమయంలోనూ పాకిస్థాన్‌లో రూపొందించిన బంతులనే ఉపయోగించారు. వాటికి బ్రజూకా అని పేరు పెట్టారు. అయితే, ఈ వరల్డ్ కప్‌లో వాడబోయే బంతిపై ఆరు ప్యానెల్స్ ఉన్నాయి.

బంతి బరువు 215 గ్రాములు
బరువు 215 గ్రాములు. 1930లో జరిగిన తొలి ప్రపంచకప్ కోసం ప్రత్యేకంగా అధికారిక బంతి అంటూ ఏమీలేదు. బంతిపై ఆంగ్గ అక్షరం ‘టి'ని పోలిన కుట్లు ఉండడంతో దాన్ని టీ-మోడల్ అని పిలిచేవారు. అయితే, తాజా వరల్డ్ కప్‌లో వాడబోయే బంతులను సియాల్‌కోట్‌లో తయారు చేశారు. క్రీడా ఉపకరణాల తయారీకి సియాల్‌కోట్ ప్రాంతం పెట్టింది పేరు.

నెలకు 7 లక్షల ఫుట్‌బాళ్లు ఉత్పత్తి
ఇక్కడ నెలకు 7 లక్షల ఫుట్‌బాళ్లను ఉత్పత్తి చేస్తారు. బ్రిటిషర్ల పాలన కాలంలో ఇక్కడ ఫుట్‌బాల్స్ తయారీ ప్రారంభమైంది. సమయం ఆదా చేసుకోవడం కోసం బ్రిటిషర్లు ఇక్కడ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. 1980లో సియాల్‌కోట్‌కు ఫుట్‌బాల్ తయారీలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1982 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో ఉపయోగించిన ట్యాంగో బాల్‌ను ఇక్కడే తయారు చేశారు.


Click it and Unblock the Notifications


