ఐఎస్ఎల్: స్ఫూర్తిలో ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ ది బెస్ట్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రస్తుత సీజన్‌లో వివిధ ఫ్రాంచైసీల సారధులను మెలిబెడుతున్నా.. తమ ప్లేయర్లకు స్ఫూర్తినివ్వడంలో విఫలమయ్యారు. సారధులు ఒకటి, అరా మినహా పెద్దగా స్ఫూర్తి దాయక ఆటతీరేమీ ప్రదర్శించడం లేదని ఆయా జట్ల కోచ్‌లు, మాజీ ఇంటర్నేషనల్ ప్లేయర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తొలి రెండు ఎడిషన్లలో సారధులు విమర్శలు రాకుండా మ్యాచ్‌ల్లో తమ వంతు విజయ సాధనకు కష్టపడ్డారు. కానీ ప్రస్తుత సీజన్ లో వారు తప్పనిసరిగా తమ ప్రొఫెషనల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ కోసం తమ ప్రతిభకు మెరుగు పెట్టాల్సి ఉన్నా తేడా ఏమీ కనిపించడం లేదు. లీగ్ లోని ఎనిమిది ఫ్రాంచైసీల జట్లు ఫ్లే ఆఫ్ దశకు ముందు తమ కోటాలో సగం మ్యాచ్ (14) ఆడేశాయి.
ముంబై సిటీ సారధి డియాగో ఫోర్లాన్ సైతం షో చూపడంలో విఫలమవుతున్నాడన్న విమర్శ ఉంది. అట్లెటికో డీ కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ, ముంబై సిటీ కెప్టెన్ ఫోర్లాన్ అడపాదడపా రెండు, ఒకటి గోల్స్ చేసినా.. వారి ఫిట్ నెస్ స్థాయికి తక్కువేనన్న అభిప్రాయం ఉంది. వీరందరికంటే ఢిల్లీ డైనమోస్ సారధి ఫ్లోరెంట్ మాలౌదా ఒక మ్యాచ్ లోనే రెండు గోల్స్ సాధించి తన సత్తా ఒకింత ప్రదర్శించాడు.
మరోవైపు నార్త్ఈస్ట్ కెప్టెన్ డిడియర్ జొకొరా మిడ్ ఫీల్డ్ కుమాత్రమే పరిమితమయ్యాడే తప్ప గోల్స్ సాధించలేదు. 'ఫోర్లాన్, పొస్టిగ, మాలౌదా అత్యున్నత స్థాయిలో పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిందెప్పుడు? ఇటీవలి కాలంలో వారి ప్రతిభ ఏమిటో నాకైతే గుర్తు లేదు మరి' అని ప్రముఖ ఇండియన్ కోచ్ సుభాషిస్ భౌమిక్ వ్యంగ్యాస్త్రం సందించాడు.

ఎక్కువ మనీ ఖర్చు చేయాలి
‘జియాంలుకా జంబ్రొట్టా, ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరించే నార్త్ఈస్ట్ హెడ్ కోచ్ నెలో వింగాడ వంటి కొందరు కోచ్‌లు మాత్రమే నన్ను ఇంప్రెస్ చేశారు. అలాగే పుణె కోచ్ అంటోనియో హబాస్ సైతం గత రెండు సెషన్లలో ఇంప్రెస్ చేశాడు. కానీ సారధులుగా మాత్రం కాదు. అది ఒక అబద్ధం. మీరు టాప్ ప్లేయర్లను పొందాలంటే మంచి (భారీగా) మనీ ఖర్చు చేయాల్సి ఉంటుంది' అని భౌమిక్ పేర్కొన్నాడు. పుణె సారధిగా తొలుత అవకాశం అందుకున్న ఐడూర్ గుడ్జోన్సెన్ చీల మండల్లో గాయం కారణంగా టోర్నమెంట్ కే దూరం కావడంతో మహ్మద్ సిస్సోకోకు పుణె సారధ్యం అవకాశం చిక్కింది.

రెండో స్థానంలో సిస్సోకో
మహ్మద్ సిస్సోకో జట్టు నుంచి అంతా తుళ్లిపడే విధంగా అత్యంత స్ఫూర్తిదాయక ప్లేను అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సీజన్‌లో 40 సార్లు జట్టు ఓటమి పాలవ్వకుండా వ్యూహం అమలు చేయడంలో సిస్సోకో రెండో స్థానంలో నిలిచాడు. గమ్మత్తేమిటంటే ఐఎస్ఎల్ లీగ్ జట్ల సారధుల్లో సిస్సోకో యువకుడు. అతి తక్కువ వయస్సు (31)లోనే సారధిగా ఎన్నికయ్యాడు. దీనికి భిన్నంగా సారధులుగా కాని విదేశీ ఆటగాళలు మార్సిల్లో పెరీరా, ఎమిలియానో అల్ఫారో వంటి ప్లేయర్లు ‘ఐఎస్ఎల్' టోర్నీలో చెప్పుకోదగిన రీతిలో ఇంప్రెస్సివ్‌గా ఆడుతున్నారు.

అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా అల్ఫారో
ఢిల్లీ డైనమోస్ లో పెరీరా, నార్త్ ఈస్ట్ జట్టులో అల్ఫారో వ్యక్తిగతంగా అత్యధిక గోల్స్ స్కోర్ లో ముందున్నారు. ఒక్కొక్కరి పేరు మీద ఐదు గోల్స్ నమోదయ్యాయంటే అతిశేయోక్తి కాదు. ఎఫ్ సి గోవా సారధి లుసియో, కేరళ బ్లాక్ బస్టర్స్ కెప్టెన్ అరోన్ హుగెస్ లు ఇప్పటివరకు గోల్ దిశగా అడుగులే వేయలేదు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ సారధి జాన్ ఆర్నె రైస్ గాయం కారణంగా అత్యధిక సమయం బెంచ్ కే పరిమితమయ్యాడు. కేరళ బ్లాక్ బస్టర్స్ సెడ్రిక్ హెంగ్బార్ట్ 20 సార్లు, ముంబైకి చెందిన లుసియాన్ గోయాన్ 43 సార్లు జట్టును కాపాడేందుకు అవసరమైన వ్యూహాలు అమలుచేయడంలో ముందున్నారు.

నార్త్ఈస్ట్ అసిస్టెంట్ కోచ్
ఒక్కోసారి మ్యాచ్ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. క్రితంసారి నార్త్ఈస్ట్ అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించిన సంతోశ్ కశ్యప్ ప్రస్తుతం ఐ - లీగ్ ముంబై ఎఫ్ సి ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్నాడు. కశ్యప్ పరిశీలన ప్రకారం ఐఎస్ఎల్ ఫ్రాంచైసీ జట్ల సారధులు తమ పెర్పార్మెన్స్ ప్రదర్శనలలో పరిమితులు పాటిస్తున్నారని తెలిపారు. ఇక ఇండియా జట్టు మాజీ డిఫెండర్ సుబ్రతా భట్టాచార్య విమర్శలు మరింత తీవ్రంగా ఉన్నాయి.

సారధి అంటే ఏమిటి?
‘ఫుట్ బాల్ సారధి అంటే ఏమిటి? నాకైతే అర్థం కావడం లేదు. సారధి అంటే లియానెల్ మెస్సీ, నేయ్మార్, క్రిస్టియానో రొనాల్డో అంటే అసలైన సారధులని నా అభిప్రాయం. ఒక వరల్డ్ కప్ లో ఆడగానే గొప్పొళ్లైపోతారా? అది కాదు. శిఖరాలకు దూసుకెళ్లాలంటే భారీ కాన్వాస్ కావాల్సి ఉంటుంది' అని సుబ్రతా భట్టాచార్య వ్యాఖ్యానించాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రముఖ ఇండియన్ ప్లేయర్ కూడా దాదాపు ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏయే ప్రాతిపదికన ప్లేయర్లను సారధులుగా తీసుకున్నారో ఐఎస్ఎల్ లీగ్ నిర్వాహకులే చెప్పాల్సి ఉంటుంది. వారంతా ఫుట్బాల్ మ్యాచ్ కు సరిపడరని తన లాగే చాలా మంది బావిస్తున్నారన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications