మెస్సీ గోల్‌తో చెవిటి పిల్లి చెప్పిన జోస్యం తప్పైంది

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ అంటేనే ఎంతో ప్రత్యేకం. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో జ్యోతిష్యులతో పాటు విశ్లేషకులు సైతం ఫలాన జట్టు గెలుస్తుందని ముందుగానే అంచనా వేస్తుంటారు. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో అచిల్లీస్ అనే చెవిటి పిల్లి ఫలాన జట్టు గెలుస్తుందని మ్యాచ్‌కి ముందుగానే అంచనా వేస్తోన్న సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్ మ్యాచ్ ఫలితాలను అంచనా వేసేందుకు గాను అచిల్లీస్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో గెలుపెవరిది? అంటే.. ఆతిథ్య జట్టు రష్యానే గెలుస్తుందని చెప్పింది. అది చెప్పినట్లుగానే ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై రష్యా 5-0తేడాతో ఘన విజయం సాధించింది.

అచిల్లీస్ చెప్పిన జోస్యం మాత్రం తప్పింది
దీంతో రష్యా వరల్డ్ కప్‌లో చెవిటి పిల్లి తన అంచనాలతో ఆశ్చర్యపరిచింది. తాజాగా అర్జెంటీనా-నైజీరియా మ్యాచ్ గురించి అచిల్లీస్ చెప్పిన జోస్యం మాత్రం తప్పింది. ఈ మ్యాచ్‌లో నైజీరియా గెలిచి నాకౌట్‌కు వెళ్తుందని, అర్జెంటీనా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అచెల్లీస్ చెప్పింది.
సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు
దీనికి సంబంధించిన వీడియోను సంబంధిత సిబ్బంది సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. కానీ, బుధవారం నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-1తేడాతో విజయం సాధించి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఆటలో భాగంగా 14వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మెస్సీ గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

2-1తేడాతో అర్జెంటీనా విజయం
ఆ తర్వాత 51వ నిమిషంలో నైజీరియా ఆటగాడు విక్టర్ మోసెస్ పెనాల్టీ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ఇక అక్కడి నుంచి ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. 86వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్కస్ రోజో మరో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యాన్ని అందించాడు.

అచిల్లీస్ ఊహించిన జట్లే గెలిచాయి
ఆట ముగిసేలోపు నైజీరియా మరో గోల్ చేయకపోవడంతో ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. దీంతో ఈసారి పిల్లి జోస్యం తప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఈ మ్యాచ్ ముందు వరకు అచిల్లీస్ ఊహించిన జట్లే గెలిచాయి. అంతేకాదు 2017 కాన్ఫెడరేషన్స్ కప్ విజేతను కూడా అచెల్లె ఇది సరిగ్గా ఊహించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications