Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్‌లో సోమవారం: జాబితా సిద్ధం, ఫిఫా అవార్డు ఎవరిని వరిస్తుందో?

On Monday in London, the finalists for TheBest FIFAFootballAwards were unveiled!

హైదరాబాద్: ప్రతి ఏటా ఫిఫా అందించే ప్రతిష్టాత్మక పుట్‌బాల్ అవార్డుల జాబితా సిద్దమైంది. పురుషుల, మహిళల అవార్డులతో పాటు పుస్కాస్ అవార్డు రేస్‌లో నిలిచిన పుట్‌బాలర్ల జాబితాను ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించింది. 2017-18 సీజన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు క్లబ్‌ సాకర్‌లో నిలకడగా రాణించిన ప్లేయర్లు ఫిఫా బెస్ట్ ఫుట్‌బాలర్ అవార్డ్స్ రేసులో ఉన్నారు.

అవార్డుల జాబితాలో ప్లేయర్ల పేర్లు ప్రకటించడంతో ప్రతిష్టాత్మక ఫిఫా అవార్డులను అందుకోబోయే ఆటగాడు ఎవరో అని సాకర్ అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ మొదలైంది. రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ప్రస్తుతం యువెంటస్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానొ రోనాల్డో‌ పురుషుల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డ్ రేసులో ముందంజలో ఉన్నాడు.

ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ క్లబ్ ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడంలో రొనాల్డోదే కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రొనాల్డో తర్వాత ఈ జాబితాలో క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ లూకా మోడ్రిచ్ నిలిచాడు. రియల్ మాడ్రిడ్ జట్టును చాంపియన్స్ లీగ్ విజేతగా నిలిపడంతో పాటు క్రొయేషియా జట్టు 2018 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ చేరడంలోనూ మోడ్రిచ్ కీలక పాత్ర పోషించాడు.

ఇక, ఈ జాబితాలో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ సలాహ్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. లివర్‌పూల్ క్లబ్‌ను చాంపియన్స్ లీగ్ ఫైనల్ చేర్చడంలో మహమ్మద్ సలాహ్ కీలకపాత్ర పోషించాడు. ఇక మహిళల్లో బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డ్ రేసులో బ్రెజిల్‌కు చెందిన మార్తాతో పాటు జర్మనీకి చెందిన జెనిఫర్ మరోజ్సాన్, నార్వేకు చెందిన అదా హెగెర్‌బర్గ్ రేసులో ఉన్నారు.

2018 ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు ఫైనలిస్ట్‌ల జాబితా :
క్రిస్టియానొ రోనాల్డో ( పోర్చుగల్/యువెంటస్ )
లూకా మోడ్రిచ్ ( క్రొయేషియా/రియల్ మ్యాడ్రిడ్)
మహమ్మద్ సలాహ్ (ఈజిప్ట్/లివర్‌పూల్ )

పురుషుల కోచ్
జ్లాట్కో దళిక్ ( క్రొయేషియా జాతీయ జట్టు)
డిడియర్ డెస్ఛాంప్స్ (ఫ్రాన్స్ జాతీయ జట్టు)
జిన్డైన్ జిదానే (రియల్ మాడ్రిడ్)

2018 ఫిఫా బెస్ట్ ఉమెన్స్ ప్లేయర్ అవార్డు ఫైనలిస్ట్‌ల జాబితా:
మార్తా ( బ్రెజిల్/ఓర్లాండో ప్రైడ్ )
జెనిఫర్ మరోజ్సాన్ (జర్మనీ/లయాన్ )
క్యాస్పర్ స్మీషెల్ (డెన్మార్క్/లీసెస్టర్ సిటీ )

మహిళల కోచ్
రేనాల్డ్ పెడ్రోస్ (ఒలింపిక్ లియోన్ ఫెమినిన్)
అస్కో తకుకురా (జపాన్ మహిళల జాతీయ జట్టు)
సరీనా వైగ్మన్ (నెదర్లాండ్స్ మహిళా జాతీయ జట్టు)

2018 ఫిఫా బెస్ట్ గోల్‌కీపర్ అవార్డు ఫైనలిస్ట్‌ల జాబితా:
హ్యూగో లోరిస్ (ఫ్రాన్స్/టోటెన్‌హామ్ హాట్‌స్పర్ )
తిబౌట్ కౌర్టోయిస్ (బెల్జియం/చెల్సీ )
అదా హెగెర్‌బర్గ్ (నార్వే/లయాన్)

2018 ఫిఫా పుస్కాస్ అవార్డు ఫైనలిస్ట్‌ల జాబితా:
క్రిస్టియానొ రోనాల్డో (రియల్ మాడ్రిడ్)
లయనెల్ మెస్సీ (అర్జెంటీనా )
మహమ్మద్ సలా (లివర్‌పూల్)
గెరాత్ బేల్ (రియల్మ్యాడ్రిడ్ )
డెనిస్ చెరిషేవ్ (రష్యా)
లాజరస్ క్రిస్టోడోపౌలస్ (ఏఈకె ఏథెన్స్)
రిలే మెక్‌గ్రీ (న్యూ క్యాసిల్ జెట్స్)
రికార్డో క్వారెస్మా (పోర్చుగల్)
బెంజమిన్ పవార్డ్ (ఫ్రాన్స్)
జియోర్జియన్ డి అరాస్కేట (క్రుజీరో క్లబ్)

ఫ్యాన్ అవార్డు
సెబాస్టియన్ కరేరా (CD ప్యూర్టో మానంట్)
జపాన్ మరియు సెనెగల్ మద్దతుదారులు
పెరూ మద్దతుదారులు

సెప్టెంబర్ 24న లండన్ వేదికగా జరుగనున్న ఫిఫా అవార్డుల వేడుకలో విజేతలను ప్రకటిస్తారు.

Story first published: Tuesday, September 4, 2018, 19:01 [IST]
Other articles published on Sep 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+