Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరికొత్త రికార్డు: మహిళల పుట్‌బాల్ మ్యాచ్‌లతో ఒలింపిక్స్ ప్రారంభం

రియో డి జనీరో: నాలుగు సంవత్సరాలకొకసారి నిర్వహించే ఒలింపిక్స్‌కు బ్రెజిల్‌లోని రియో నగరం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడానికి ముందే మహిళల పుట్‌బాల్ మ్యాచ్‌ల పోటీలు మొదలయ్యాయి.

ఈ మ్యాచ్‌లలో కెనడా పుట్‌బాల్ జట్టుకు చెందిన జనైని బైకీ ఒలింపిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. సరిగ్గా ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి రెండు రోజులు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 20 సెకన్లలోనే గోల్ సాధించింది. ఇది ఒలింపిక్ చరిత్రలోనే అత్యంత వేగ వంతమైన గోల్ కావడం విశేషం.

తొలి మ్యాచ్‌లో భాగంగా స్వీడన్‌కు చెందిన మహిళా జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. స్వీడన్‌ జట్టులో నిల్లా ఫీచర్ గోల్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక ఒలింపిక్స్‌కు ఆతథ్యం ఇస్తున్న బ్రెజిల్ చైనాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

Rio Olympics 2016 begins with women's football, new record set

బ్రెజిల్ మహిళా జట్టు పాల్గొన్న ఈ మ్యాచ్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు మాజీ వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మార్టా హాజరయ్యారు. గ్రూప్ ఈలో బ్రెజిల్‌తో పాటు చైనా, స్వీడన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఆగస్టు 7న బ్రెజిల్, స్వీడన్‌తో తలపడనుంది.

మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టుపై యుఎస్ఏ విజయం సాధించింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌‍లో వరుసగా 12 సార్లు విజయం సాధించిన జట్టుగా యుఎస్ఏ నిలిచింది.

రియో ఒలింపిక్స్‌ 2016లో తొలి ఫలితాలు:

జర్మనీ 6-1 జింబాబ్వే
కెనడా 2-0 ఆస్ట్రేలియా
ఫ్రాన్స్ 4-0 కొలంబియా

గ్రూప్ స్టేజి స్టాండింగ్స్:

































Position Teams Matches Points
1 Brazil 1 3
2 Sweden 1 3
3 South Africa 1 0
4 China 1 0

Group F



































Position Teams Matches Points
1 Germany 1 3
2 Canada 1 3
3 Australia 1 0
4 Zimbabwe 1 0

Group G



































Position Teams Matches Points
1 France 1 3
2 USA 1 3
3 New Zealand 1 0
4 Colombia 1 0
Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+