Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన యువ సంచలనం ఒలీవియా స్మిత్

Olivia Smith: కెనడాకు చెందిన 20 ఏళ్ల యువ ఫుట్‌బాల్ సంచలనం ఒలీవియా స్మిత్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. లివర్‌పూల్ నుంచి ఆర్సెనల్ క్లబ్‌కు 10 లక్షల పౌండ్లు(సుమారు రూ.11.3 కోట్లు లేదా 1.34 మిలియన్ యూఎస్ డాలర్లు) ప్రపంచ రికార్డు బదిలీ మొత్తంతో ఒలీవియా స్మిత్ చేరారు. ఈ భారీ ఒప్పందంతో ఒలీవియా స్మిత్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా అవతరించింది.

మునుపటి రికార్డులను బద్దలుకొట్టిన ఒలీవియా

ఈ బదిలీ గతంలో చెల్సియా అమెరికన్ స్టార్ నావోమి గిర్మా కోసం శాన్ డియాగో వేవ్‌కు 9 లక్షల పౌండ్ల (రూ.10.2 కోట్లు) రికార్డును బద్ధలు కొట్టింది. ఆర్సెనల్ మహిళా ఫుట్‌బాల్ డైరెక్టర్ క్లెయిర్ వీట్ల ఈ యువ స్టార్‌ను ప్రశంసిస్తూ.. "ఆమె ఆటలోని అత్యంత ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణుల్లో ఒకరు.క్లబ్‌లో ఆమె మరింత అభివృద్ధి చెందడానికి గొప్ప సామర్థ్యం ఉంది." అని అన్నారు.

Olivia Smith Becomes World s Most Expensive Female Footballer

పురుషుల ఫుట్‌బాల్‌తో పోలిస్తే ఇప్పటికీ వెనుకబడిన మహిళల ఆట
అయితే ఈ రికార్డు బదిలీ తర్వాత కూడా మహిళల ఫుట్‌బాల్ ఆటతో పోలిస్తే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు 2017లో నేమార్ బార్సిలోనా నుంచి పీఎస్జీకి రికార్డు స్థాయిలో 262 మిలియన్ల అమెరికా డాలర్ల(సుమారు రూ.2,200 కోట్లు)కు బదిలీ అయ్యాడు. ఇది ఒలీవియా స్మిత్ బదిలీ మొత్తం కంటే దాదాపు200 రెట్లు ఎక్కువ. కిలియన్ ఎంబాప్పే పీఎస్జీ కోసం 216 మిలియన్ అమెరికన్ డాలర్లకు సంతకం చేశాడు. అతను ఇప్పటివరకు రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు.

ఒలీవియా స్మిత్ కెరీర్ ప్రస్థానం
ఒలీవియా స్మిత్ నార్త్ లండన్ క్లబ్‌తో 4 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె కెరీర్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. పెన్ స్టేట్‌తో బలమైన కాలేజియేట్ సీజన్ తర్వాత, ఆమె 2023లో స్పోర్టింగ్ లిస్బన్లో చేరింది. అక్కడ 28 మ్యాచ్‌లలో 16 గోల్స్ చేసింది. ఒక సంవత్సరం తర్వాత, ఆమె లివర్‌పూల్లో చేరి 25 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్ సాధించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కూడా ఒలివియా స్మిత్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె 2019లో కేవలం 15 సంవత్సరాల వయస్సులో కెనడాకు చెందిన అతి పిన్న వయస్కురాలైన అంతర్జాతీయ క్రీడాకారిణిగా అరంగేట్రం చేసింది.

కొత్త క్లబ్‌లో కొత్త ఉత్సాహం
ఆర్సెనల్ ప్రధాన కోచ్ రెనీ స్లెగర్స్ తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. "ఒలీవియా ఒక ఉత్తేజకరమైన యువ క్రీడాకారిణి, ఆమె ఆర్సెనల్‌కు గొప్ప సహకారం అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ఆమె మానసిక స్థితి, వ్యక్తిత్వం మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఆమె ఇంత చిన్న వయస్సులోనే రెండు యూరోపియన్ లీగ్‌లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది" అని అన్నారు. ఒలీవియా స్మిత్ కూడా ఈ కొత్త సవాలుకు ఉత్సాహంగా ఉన్నారు.

Story first published: Saturday, July 19, 2025, 9:51 [IST]
Other articles published on Jul 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+