స్పెయిన్ గెలుస్తుందని సముద్ర జంతువు ఆక్టొపస్ జోస్యం
డర్బన్: సముద్ర జంతువు ఆక్టోపస్ స్పెయిన్ వైపు మొగ్గు చూపింది. ఆరంభంలో తడబడినా మ్యాచ్ మ్యాచ్ కి పరిణతి సాధిస్తోన్న స్పెయిన్... వేగమే మంత్రంగా దూసుకుపోతున్న జర్మనీ...కీలక సమరానికి సమాయత్తమయ్యాయి. రెండు మేటి జట్ల మధ్య బుధవారం జరిగే ఈ సెమీఫైనల్లో ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టిస్తుంది. ఎనిమిది దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్ ఏనాడూ ఫైనల్ కు చేరుకోలేదు. మరోవైపు మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ ఈసారీ ఫైనల్ చేరితే ఎనిమిదోసారి ఈ ఘనత సాధించిన తొలి జట్టవుతుంది.
ఆసక్తికర విషయమేమిటంటే...ఈ ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ నుంచి జర్మనీ మ్యాచ్ ల ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేస్తున్న సముద్రపు జంతువు 'ఆక్టోపస్' సెమీఫైనల్లో స్పెయిన్ నెగ్గుతుందని తేల్చింది. దాంతో బరిలోకి దిగకముందే జర్మనీ శిబిరంలో ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ప్రపంచకప్ లో మాత్రం ఇప్పటివరకు జర్మనీపై స్పెయిన్ విజయం సాధించలేదు. ఈసారి స్పెయిన్ నెగ్గి ఆ లోటును తీర్చుకుంటుందో లేక మరోసారి ఓడి నిరాశను మూటగట్టుకుంటుందో వేచిచూడాలి.
ఫామ్: సెమీఫైనల్ చేరుకునే క్రమంలో అటు జర్మనీ...ఇటు స్పెయిన్ లీగ్ దశలో చెరో మ్యాచ్ లో ఓటమి చవిచూశాయి. అయితే నెమ్మదిగా పుంజుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లో...క్వార్టర్ ఫైనల్లో అలవోక విజయాలతో ముందంజ వేశాయి.
అనుకూలం: రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్నాయి. ఫార్వర్డ్స్ మిరోస్లావ్ క్లోజ్, పొడోల్‌స్కీ...మిడ్‌ఫీల్డర్స్ ఓజిల్, ష్వాన్‌స్టీగర్ క్షణాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సమర్థులు. క్లోజ్ మరో గోల్ చేస్తే ప్రపంచకప్ లో అత్యధికంగా 15 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న రొనాల్డో (బ్రెజిల్) రికార్డును సమం చేస్తాడు. స్పెయిన్ జట్టులో డేవిడ్ విల్లా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్ ఐదు గోల్స్ సాధించాడు. మిడ్ ఫీల్డర్స్ జావి, ఆండ్రీస్ ఇనెస్టా, సెక్ ఫాబ్రిగెస్, జాబి అలోన్సో సమన్వయంతో కదిలితే ఎంతటి జట్టుకైనా ఇబ్బందులు తప్పవు. గోల్‌కీపర్ ఇకెర్ కాసిలాస్, డిఫెండర్స్ పుయోల్, సెర్గియో రామోస్ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థి ఎదురుదాడులను ఎదుర్కొంటారు.
ప్రతికూలం: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఎల్లో కార్డులకు గురవ్వడంతో జర్మనీ స్టార్ ప్లేయర్ థామస్ ముల్లర్ సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నాలుగు గోల్స్ చేసి జోరుమీదున్న ముల్లర్ లేకపోవవడం జర్మనీకి లోటే. మరోవైపుస్పెయిన్ స్ట్రయికర్ ఫెర్నాండో టోరెస్ ఇంకా ఫామ్‌లోకి రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న టోరెస్ వైఫల్యం స్పెయిన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
రెండో సెమీఫైనల్
జర్మనీ/ స్పెయిన్
రాత్రి 12 గంటల నుంచి, ఈఎస్పీఎన్ లో ప్రత్యక్ష ప్రసారం.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications