న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

క్రీడా ఔత్సాహికుల ముందుకు మరో కొత్త లీగ్

NRL launches touch football league

హైదరాబాద్: నేషనల్ రగ్భీ లీగ్ (ఎన్ఆర్ఎల్) ఫుట్‌బాల్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఈ క్రమంలో ఆరు జట్లతో కూడిన ఎలైట్ టచ్ ఫుట్‌బాల్ ప్రీమియర్‌షిప్‌ను సిద్ధం చేయనుంది. ఈ కాంపిటేషన్‌కు ఇప్పటికే పురుషుల, మహిళల విభాగాలను ఉంచాలని నిర్ణయించుకొన్నట్లు నిర్వహకులు తెలిపారు. (ఎన్‌ఆర్‌ఎల్) అనుబంధ జట్లన్ని కలిపి పసెమీ ప్రొఫెషనల్ లీగ్‌గా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

ఇటీవలే ముగిసిన గోల్డ్ కోస్ట్, నార్త్ క్వీన్స్‌ల్యాండ్, బ్రిస్‌బేన్ వంటి ప్రముఖ ప్రాంతాలనుంచి జట్లను ఆహ్వానించనున్నారు. ఈ మ్యాచ్‌లు 11 నుంచి 20 రౌండ్ల వరకూ నిర్వహించాలని యోచిస్తున్నారు. దాదాపు ఆటగాళ్లందరూ అండర్-20 వయస్సున్న వారే పాల్గొనున్నట్లు సమాచారం.

ఈ సంవత్సరం అండర్ 20 మ్యాచ్‌లే లేకపోవడంతో ఈ టోర్నీ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. మెయిన్ మ్యాచ్‌లకు జరగడానికి కేవలం అరగంట ముందే ఈ మ్యాచ్ జరుగుతాయి. దీంతో పురుషుల, మహిళల విభాగాల్లో టోర్నీ జరుగుతుండటంతో అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నామని (ఎన్నారెల్) ముఖ్య అధికారి గ్రీన్ బెర్గ్ వెల్లడించారు.

దీన్ని ఓ పెద్ద సక్సెస్‌గా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. 2013వ సంవత్సరం నుంచి ప్రచారం చేస్తూ 6 లక్షల వరకూ వీక్షకులను పొందిన మీడియా ఛానెళ్లకే మళ్లీ ప్రసార హక్కులు అప్పజెప్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది మొదలైన కొన్నాళ్లకు దాదాపు ఈ సంవత్సరాంతంలో నాలుగు జట్లతో కూడిన మహిళా లీగ్ కూడా ఆరంభించనున్నట్లు తెలిపారు. బ్రిస్‌బేన్, ద వారియర్స్, సెయింట్ జార్జ్ ఇల్లావర్రా. సిడ్నీ రోస్టర్స్ జట్లు లీగ్ లో పాల్గొని తమ సత్తాచాటనున్నాయి.

Story first published: Wednesday, April 18, 2018, 16:17 [IST]
Other articles published on Apr 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X