Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎన్నో విశేషాలు: బయోపిక్‌గా బైచుంగ్ భూటియా జీవితం

Now, a biopic on Indian football captain Bhaichung Bhutia

హైదరాబాద్: ప్రస్తుతం భారత్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురి సినీ, రాజకీయ, క్రీడాకారుల బయోపిక్స్ విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అజహరుద్దీన్, మేరీకోమ్, మిల్కా సింగ్ తదితరుల బయోపిక్‌లు అభిమానుల ప్రేక్షకాధరణ పొందాయి.

బయోపిక్‌గా బైచుంగ్ భూటియా జీవితగాథ

మరికొందరి బయోపిక్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. కపిల్ దేవ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా బయోపిక్స్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఈ క్రమంలో మరొక ఆటగాడి బయోపిక్ తెరకెక్కబోతోంది. అదెవరో కాదు... భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా బయోపిక్.

 బాలీవుడ్ సినీ నిర్మాత ఆనంద్ కుమార్

బాలీవుడ్ సినీ నిర్మాత ఆనంద్ కుమార్

భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా బయోపిక్‌పై బాలీవుడ్ సినీ నిర్మాత ఆనంద్ కుమార్ నిర్మించే పనిలో ఉన్నారు. గతంలో సంజయ్ దత్-వివేక్ ఒబెరాయ్ నటించిన ‘జిలా ఘజియాబాద్' చిత్రాన్ని ఆనంద్ కుమార్ నిర్మించారు. భూటియా జీవితంలోని ప్రధాన ఘట్టాలతో బయోపిక్‌కు సంబంధించిన స్టోరీ విషయంలో ఆనంద్ కుమార్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు.

భూటియాను కలిసి అన్ని విషయాలు చర్చించిన ఆనంద్ కుమార్

భూటియాను కలిసి అన్ని విషయాలు చర్చించిన ఆనంద్ కుమార్

ఇటీవలే భూటియాను కలిసి ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు. భూటియా పాత్రకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి, ప్రధాన పాత్రధారులు, దర్శకుడి ఎంపికకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన జీవిత గాథ ఆధారంగా బయోపిక్ రానుండడం పట్ల భూటియా సంతోషం వ్యక్తంచేశారు.

గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పిన భూటియా

తన జీవితాన్ని వెండితెరమీదకు తీసుకొచ్చేందుకు అర్హమైనదిగా కొందరు భావించడాన్ని తాను గర్వకారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బయోపిక్‌కు ఆనంద్ కుమార్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందంటూ భూటియా తాజాగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Story first published: Thursday, November 15, 2018, 18:01 [IST]
Other articles published on Nov 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+