గౌహతి: జాన్ అబ్రహం యాజమాన్యంలోని నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి క్లబ్ మరో సంచలన విజయం సాధించింది. ఆదివారం ప్రారంభ మ్యాచ్‌లో కేరళ బ్లాక్‌బస్టర్స్‌పై విజయం ఊపుతో మంగళవారం ఎఫ్‌సి గోవా క్లబ్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్ర భాగానికి దూసుకెళ్లింది.
నార్త్ ఈస్ట్ కోచ్ వింగాడ తన వ్యూహం మార్చి, కేరళ బ్లాక్‌బస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన వారి స్థానే పలు మార్పులుచేయడంతోపాటు అటాకింగ్‌కు కేవలం ఎమిలియానో అల్ఫారోపైనే భారం వేశారు. ఫలితంగా రెండు గోల్స్ కూడా అల్ఫారో చేయడమే గమనార్హం.
నార్త్ ఈస్ట్ చేతిలో లీగ్‌స్థాయిలో తొలిసారి ఓటమి పాలైన ఎఫ్‌సి గోవాకిది స్వయంకృతాపరాధమే. గోల్స్‌చేసే అవకాశం వచ్చినప్పుడల్లా తాత్సారం చేయడం, చాన్స్ మిస్‌చేసుకున్నందుకు మూల్యంచెల్లించింది. వింగాడ వ్యూహం ముందు గోవా కోచ్ జికో మంత్రజాలం పనిచేయలేదు.

తొలి హాఫ్‌లో 12వ నిమిషంలో రోమరిక్ పంపిన బంతిని గోల్‌పోస్ట్‌కు పంపడడంలో తొలిసారి విఫలమయ్యాడు. కానీ 20 నిమిషం తర్వాత డెడ్‌లాక్ బ్రేక్‌చేసిన నార్త్‌ఈస్ట్ అటాకర్ అల్ఫారో తొలి గోల్‌తో మ్యాచ్‌పై పట్టు సాధించాడు. లూయిస్ పాస్‌చేసిన బంతిని అందుకున్న లక్ష్మీకాంత్ కట్టిమణిపై ఒత్తిడి తెచ్చాడు. తద్వారా తన నియంత్రణలోకి వచ్చిన బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌కు పంపడంతో నార్త్ ఈస్ట్ తొలి గోల్ సాధించింది.
మొదటి హాఫ్ మ్యాచ్ ముగిసే వరకు స్కోర్ సమంచేసేందుకు గోవా ప్లేయర్లు చేసిన ప్రయత్నాలన్నీ నార్త్‌ఈస్ట్ ఆటగాళ్లు అడ్డుకున్నారు. ఇక రెండో హాఫ్‌లోనూ ఇదే టెంపోతో లీడ్ కొనసాగిస్తూనే మరో గోల్ కోసం ప్రయత్నించారు జాన్ అబ్రహం టీం సభ్యులు.
తిరిగి 81వ నిమిషంలో నార్త్‌ఈస్ట్ సబ్‌స్టిట్యూట్ నికోలస్ వెలెజ్ సాయంతో అల్ఫారో రెండో గోల్ సాదించాడు. నార్త్‌ఈస్ట్ కెప్టెన్ సుబ్రతా పాల్ పలు దఫాలు గోవా గోల్స్ యత్నాలను విజయవంతంగా అడ్డుకోవడం జాన్ అబ్రహం జట్టుకు కలిసి వచ్చింది.
ఐదుగురు కీలక ప్లేయర్లు రాబిన్‌సింగ్, డెంజిల్ ఫ్రాంకో, సుభాషిష్ రాయ్ చౌదరి, గ్రెగోరి ఆర్నోలిన్, లుసియానో సోబ్రోసా లేకుండానే బరిలోకి దిగిన గోవా కోచ్ జికో పదేపదే వ్యూహాలు మార్చినా ప్రయోజనం లేకపోయింది.
తొలుత వ్యూహాత్మకంగానే వ్యవహరించిన గోవా ప్లేయర్ రాజు గైక్వాడ్ ఏడో నిమిషంలో గోల్‌చేసే యత్నాన్ని నార్త్‌ఈస్ట్ సారధి సుబ్రతాపాల్ సక్సెస్‌పుల్‌గా అడ్డుకున్నాడు. 20 నిమిషంలో నార్త్‌ఈస్ట్ సాధించిన పాయింట్‌ను సమం చేసేందుకు గోవాకు 38వ నిమిషంలో వచ్చిన చాన్స్ సద్వినియోగానికి మందార్‌రావు దేశాయి ప్రయత్నించినా నార్త్‌ఈస్ట్ తేలిగ్గానే తిప్పికొట్టింది.
మరోసారి తొలి హాఫ్ మ్యాచ్ ముగియడానికి 30 సెకన్ల ముందు డేంజర్ ఏరియా నుంచి కెప్టెన్ లుసియా ద్వారా గోల్‌కు గాంక్లేవ్ చేసిన యత్నాన్ని మరోసారి సుబ్రతాపాల్ అడ్డుకుని తన లీడ్‌ను కొనసాగించాడు. ఇక సెకండ్ హాఫ్‌లో ఇరు జట్లు హోరాహోరీగానే తలపడ్డాయి. నార్త్‌ఈస్ట్ లీడ్ కొనసాగించేందుకూ.. స్కోర్ సమంచేసి మ్యాచ్‌ను డ్రా ముగించేందుకు గోవా ప్రయత్నించాయి.