Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: టాప్‌కు చేరుకోవడమే లక్షంగా నార్త్ఈస్ట్

గౌహతి: ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీ లీగ్ దశలో టాప్‌కు చేరుకోవడమే లక్షంగా నార్త్ఈస్ట్ యునైటెడ్, అట్లెటికో డీ కోల్‌కతా జట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా నార్త్ఈస్ట్ ఓటమి పాలైంది.

ఇక కోల్‌కతాలోనే జరిగిన మ్యాచ్ లో ముంబై సిటీ చేతిలో అట్లెటికో డీ కోల్ కతా తొలి పరాజయాన్ని మూటగట్టుకున్నది. గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఏడోసారి పోటీ పడుతున్న నార్త్ఈస్ట్, కోల్‌కతా కళ్లన్నీ టాప్‌స్పాట్ పైనే ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిచెన్నైయిన్‌తో ఈ నెల 20న జరిగిన మ్యాచ్ పరాభవం భారాన్ని పోగొట్టుకునేందుకు పునరుత్తేజితం కావాలని నార్త్ఈస్ట్ ఉవ్విళ్లూరుతున్నది. సొంతగడ్డపై ఆడటం నార్త్ఈస్ట్ జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఇంతకుముందు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో తొలి ఏడాది రెండు మ్యాచ్ లు కోల్ కతా, గతేడాది నార్త్ఈస్ట్ జట్లు గెలుచుకున్నాయి.

తద్వారా ఇప్పటివరకు ఉన్న ఓటమి భారాన్ని దించుకోవాలని తలపోస్తున్నాయి. నార్త్ఈస్ట్ హెడ్ కోచ్ నెలో వింగాడ ఈ సందర్భంగా మాట్లాడుతూ 'మా జట్టుకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పరిణతి సాధించిన జట్టు మాది. మేం పలు అంశాల్లో కష్టపడి పనిచేయగలం. కానీ కొన్నిసార్లు కొద్దిగా లక్ కూడా కలిసి రావాలి. మాకు కాలం కలిసి రానందు వల్లే చెన్నైయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాం. కానీ14 మ్యాచ్‌ల్లో మా వైపే లక్ ఉంటేనే గెలుపొందగలమని మా నమ్మకం. అయితే చెన్నైయిన్ తో జరిగిన మ్యాచ్‌లో మేం సరిగ్గా ఆడలేదు' అని చెప్పాడు.

ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో నార్త్ఈస్ట్ తొలి మ్యాచ్‌లోనే శుభారంభాన్ని అందుకున్నది. అదే ఊపులో ముందుకు సాగుతున్నది. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించింది. ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలోకి రావడంతోనే నార్త్ఈస్ట్ జట్టులో విశ్వాసం పరిఢవిల్లుతుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే గత పరాజయాలన్నీ కొట్టుకుపోతాయి. ప్రొఫెసర్ గా పేరొందిన వింగాడ మాత్రం ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని, అసాధ్యమైతే డ్రాగానైనా ముగించి పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాడు. ఆరు మ్యాచ్ లు ఆడిన నార్త్ఈస్ట్ జట్టు చేతిలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి.

అట్లెటికో డీ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో గెలుపొందిన ముంబై సిటీ 11 పాయింట్లతో టాప్ స్థానంలో కొనసాగుతున్నది. అట్లెటికో డీ కోల్ కతా సైతం టాప్ స్పాట్ పైనే కేంద్రీకరించింది. టాప్ ఫోర్ లో చోటు దక్కించుకుంటేనే సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించగలమని విశ్వసిస్తున్నది. అందుకోసమే అహర్నిశలు పోరాడుతున్నది.

NorthEast United, ATK eye top spot

గత నాలుగు మ్యాచ్ ల్లో అట్లెటికో డీ కోల్ కతా కేవలం ఐదు పాయింట్లే పొందింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో నిరాశకు గరయ్యారు. ఈ సీజన్ లో అట్లెటికో డీ కోల్ కతాకు ఇది తొలి ఓటమి. ఇదిలా ఉంటే పదేపదే రిఫరీ నిర్ణయాలపై నిరసన తెలియజేయడానికి ప్రాధాన్యం ఇస్తున్న కోల్ కతా చీఫ్ కోచ్ జోస్ మొలీనాపై ఐఎస్ఎల్ నిర్వాహకులు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు విధించారు.

దీంతో శుక్రవారం జరిగే మ్యాచ్ లో మొలీనా కేవలం స్టాండ్స్ కు మాత్రమే పరిమితం కానున్నాడు. 2014లో తొలి ఐఎస్ఎల్ చాంపియన్ అయిన కోల్ కతా.. 6 మ్యాచ్ లలో తొమ్మిది పాయింట్లు పొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

డిడియర్ జొకొరా నార్త్ఈస్ట్ జట్టుకు వెన్నముక వంటివాడు. టార్జాన్ మాదిరిగా కీలక సందర్భాల్లో స్పందించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఆయనకు గల అనుభవాలను ఉపయోగించుకుని కోల్ కతాపై విజయం సాధించేందుకు నార్త్ఈస్ట్ కు జొకోరా సేవలు అనివార్యం.

ప్రస్తుత సీజన్ లోనే కోల్ కతా ప్లేయర్ ఇయాన్ హుమ్ ఆరు మ్యాచ్ ల్లో రెండు గోల్స్ సాధించాడు. ముందు భాగంలో అటాకింగ్, మిడ్ ఫీల్డింగ్ లో ప్రత్యర్థిని నిలువరించే సామర్థ్యం హుమ్ సొంతం. మిడ్ ఫీల్డర్‌గా నార్త్ఈస్ట్ తో గెలుపుకు హుమ్ సేవలు కీలకం.

ఐఎస్ఎల్ లోనే హీరోగా నిలిచిన హోలీచరణ్ నార్జారే తన పెర్పార్మెన్స్‌తో కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కీలక పాస్ ల విషయంలో అసిస్టెన్స్ ఇవ్వడలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. బ్యాక్ లైన్ లో కోల్ కతాకు సమస్యలు స్రుష్టించాలంటే నార్జారీ సేవలు అవసరమే.

ఇక జావీ లారా రెండు గోల్స్ చేసినా ఎల్లప్పుడూ స్తబ్దుగా ఉంటాడు. జట్ల మధ్య చిన్న అవకాశం చిక్కినా దూసుకెళ్ల నేర్పు గలవాడు. ప్రమాదకరమైన ఫ్రీ కిక్స్ తో నెట్ లోకి బంతిని పంపడానికి ఏమాత్రం సంకోచించడు. ప్రత్యర్థి నుంచి బంతిని ఒడుపుగా కొట్టేయడంలోనూ పరిణతి కలిగిన ప్లేయర్.

ప్రస్తుత ఎడిషన్ లో నాలుగు గోల్స్ చేసి లీడ్‌లో ఉన్న ఎమిలియానో అల్ఫారో పెర్పార్మెన్స్‌ను తెలియజేస్తాయి. ఇదే ధోరణిని కొనసాగించాలని ఉబలాటపడుతున్న అల్ఫారో ఇన్ సైడ్ బాక్స్ వద్ద ప్రమాదకర రీతిలో గాలిలోకి ఎగిరి ప్రత్యర్థి దూకుడును నిలువరించగలడు. ఈ దఫా గోల్డెన్ బూట్ అవార్డు ఆయననే వరిస్తుందని అంచనా వేస్తున్నారు.

కోల్ కతా జట్టులో రెగ్యులర్ స్టార్టర్ గా నిలిచిన తిరి బ్యాక్ లైన్ వద్ద ప్రత్యర్థి అవకాశాలను తిప్పికొట్టడంతోపాటు జట్టు విజయావకాశాల మెరుగుదలకు కీలక పాత్ర పోషించనున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+