For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సజీవంగా నార్త్ ఈస్ట్ ప్లేఆఫ్ ఆశలు

అదనపు టైంలోనూ చివరిక్షణంలో గోల్ సాధించడం ద్వారా సెమీ ఫైనల్స్ బెర్త్‌పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి ఆశలు సజీవంగా నిలుపుకున్నది.

చెన్నై: అదనపు టైంలోనూ చివరిక్షణంలో గోల్ సాధించడం ద్వారా సెమీ ఫైనల్స్ బెర్త్‌పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి ఆశలు సజీవంగా నిలుపుకున్నది. శనివారం రాత్రి చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయిన్ ఎఫ్ సితో తలపడిన నార్త్ఈస్ట్ 3 - 3 స్కోర్ తేడాతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

డిఫెండింగ్ చాంపియన్, నార్త్ఈస్ట్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ పోరును తలపించింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు ఢీ కొన్నాయి. గమ్మత్తేమిటంటే చెన్నైయిన్ ప్లేయర్ దుదూ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు.

మరోవైపు నార్త్ఈస్ట్ లో కీలక ప్లేయర్ నికోలస్ వెలెజ్ రెండు గోల్స్ చేశాడు. మూడో గోల్ చేసేలోగా రిఫరీ ఎల్లోకార్డు చూపడంతో ఇన్‌జ్యూరీ టైంలో షౌవిక్ ఘోష్ కార్నర్ కిక్ ద్వారా గోల్ సాధించి నాటకీయ ఫక్కీలో నార్త్ఈస్ట్‌ను గట్టెక్కించాడు.

నార్త్ ఈస్ట్, చెన్నైయిన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్యంతం ఆసక్తికరంగానూ, థ్రిల్లింగ్‌గానూ సాగింది. పాయింట్ల పట్టికలో 12 మ్యాచ్‌లు ఆడి ఐదో స్థానంలో నిలిచిన నార్త్ఈస్ట్.. ముందు మరో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. చెన్నైయిన్ ఎఫ్ సి ప్లేయర్ మాక్‌ఫెర్లిన్ దుదూ హ్యాట్రిక్ గోల్స్ సాధించినా మ్యాచ్ గెలుచుకుని మూడు పాయింట్లు సాధించేందుకు సరిపోలేదు.

ప్లేఆఫ్ బెర్త్ కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న చెన్నైయిన్ జట్టుకు ఈ మ్యాచ్ డ్రా కావడం ఇబ్బందికరమే. 13 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన చెన్నైయిన్ తిరిగి సెమీ ఫైనల్స్ స్థాయికి చేరుకునేందుకు అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఎందుకంటే చెన్నైయిన్ ముందు మరొక మ్యాచ్ మాత్రమే ఉంది.

NorthEast hold Chennaiyin 3-3 in dramatic match

34వ నిమిషంలో దూదూ తొలిగోల్ సాధిస్తే, నార్త్ఈస్ట్ తరఫున మరో నాలుగు నిమిషాలకు నికోలస్ దాన్ని సమంచేశాడు. ఫస్టాఫ్ చివరి నిమిషంలో దూదూఒమాగ్ బేమి రెండో గోల్ తో జట్టుకు 2 - 1 ఆధిక్యాన్ని సాధించాడు. కానీ సెకండాఫ్ ప్రారంభమైన ఆరు నిమిషాలకు నికోలస్ వెలెజ్ మరో గోల్ సాధించడంతో స్కోర్ సమమైంది. 81వ నిమిషంలో మరోసారి దూదూ గోల్ సాధించి జట్టుకు 3 - 2 ఆధిక్యం సాధించాడు.

కానీ ఇన్‌జ్యూరీ టైంలో షౌవిక్ ఘోష్ హెడ్డర్ ద్వారా కార్నర్ కిక్ పంపడంతో మూడో గోల్ సాధించడంతో చెన్నైయిన్ ఆశలు అడియాసలైనా మ్యాచ్ డ్రాగా ముగిసింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో నార్త్ఈస్ట్ కుర్రాళ్లు చివరిదశలో పోరాట స్ఫూర్తి ప్రదర్శించారు. వెలెజ్ తనదైన శైలిలో పంపిన బంతిని చెన్నైయిన్ గోల్ కీపర్ ఎలీ సాబియా అడ్డుకున్నాడు.

చెన్నైయిన్ కుర్రాళ్లు మొదటి నుంచి బెటర్ సైడ్ ఆటతీరు కనబరిచారు. ఆరో నిమిషంలోనే డెడ్ లాక్ బ్రేక్ అవుతుందని భావించినా డేవిడ్ సుక్కీ పంపిన బంతి వైడ్‌గా మారిపోయింది. జాన్ ఆర్నె రైస్ సైతం ఏడో నిమిషంలో పంపిన ప్రీ కిక్ గోల్ పోస్ట్ వద్ద గోల్ కీపర్ సుబ్రతాపాల్ అడ్డుకోవడంతో క్రాస్ బార్ మీదుగా దూసుకెళ్లిపోయింది.

నార్త్ఈస్ట్ ప్లేయర్ రోమరిక్ 22వ నిమిషంలో గోల్ సాధించేందుకు తొలిషాట్ కొట్టినా కరంజిత్ సింగ్ నిలువరించాడు. మరో మూడు నిమిషాలకు ఈ ఐవరీకోస్ట్ మిడ్ ఫీల్డర్ మరోసారి మయిల్సన్ అల్వెస్‌కు పంపిన బంతిని కరంజిత్ సింగ్ అడ్డుకోవడంతో గోల్ సాధించలేకపోయారు. వెలెజ్ నుంచి వచ్చిన పాస్‌ను ఎమిలియానో అల్ఫారో గోల్ పోస్ట్ దారి మళ్లించినా మళ్లీ కరంజిత్ విజయవంతంగా అడ్డుకున్నాడు.

నార్త్ఈస్ట్ 34వ నిమిషంలో గోల్ సాధించి ఆధిపత్యం ప్రదర్శించేందుకు జరిపిన ప్రయత్నాలు ఫలించలేదు. వ్యక్తిగతంగా నికోలస్ వెలెజ్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే ఈ మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ తేలిగ్గా బయటపడింది. 38వ నిమిషానికి ముందు ఈ అర్జెంటీనా ప్లేయర్ పెనాల్టీ కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్ట్ కు పంపేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+