Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో గెలుపుపై జాన్‌ అబ్రహం టీం 'ఐ': గాయాల బారీన గోవా

గౌహతి: ఐఎస్‌ఎల్‌ మూడో ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌లో గెలుపుతో ఆత్మ విశ్వాసం పెంచుకున్న నార్త్ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి క్లబ్‌ జట్టు వరుసగా మరో విజయం కోసం కాచుకుని చూస్తున్నది. కేరళ బ్లాక్‌బస్టర్స్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో నార్త్ ఈస్ట్‌ 1 - 0 స్కోర్‌ తోడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాగా, మంగళవారం సాయంత్రం గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్‌ స్టేడియంలో ఎఫ్‌సి గోవా క్లబ్‌ జట్టుతో తలపడనున్నది. తొలి మ్యాచ్‌లో గోల్‌ సాధించి జట్టును విజయ తీరానికి నడిపించిన జపనీస్‌ మిడ్‌ ఫీల్డర్‌ కస్తుమి యుసా, పాజిటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌ గల నూతన కోచ్‌ నెలో వింగాడ ఉండటం నార్త్‌ఈస్ట్‌కు కలిసొచ్చే అంశాలు.

'సెమీస్‌కు వెళ్లాలంటే మేం చాలా బాగా ఆడాల్సిన అవసరం ఉన్నదని నాకు తెలుసు. ప్రతి క్రీడాకారుడికి లక్ష్యం ఉంది. మేం మరింత నిలకడగా ఆడాల్సి ఉంది. ఒక జట్టుగా మేం ఎదగకపోతే మేం బాగా ఆడినా అది సరిపోదు' అని వింగాడ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మ్యాచ్‌లో తనకు ఉన్న బెస్ట్‌ ఎలెవెన్‌ ఆప్షన్‌ను వినియోగించుకుంటానని అన్నారు. కొంతమంది క్రీడాకారులు గాయాలతో సతమతం అవుతుంటే మరి కొందరు పూర్తిగా 90 నిమిషాల పాటు ఫిట్‌గా ఉండే అవకాశం లేదని వింగాడ తెలిపారు. విదేశీ ప్లేయర్ల ఆట తీరు సంతృప్తికరమన్న వింగాడ.. భారత్‌ బాయ్‌తో చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.

రెండో మ్యాచ్‌లోనూ విజయంపై వింగాడ ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. ఈ మ్యాచ్‌ ఫలితం చాలా కీలకమని నార్త్‌ఈస్ట్‌ కుర్రాళ్లకు నూరిపోశాడు. ఇప్పటివరకు గోవాపై విజయం సాధించని జాన్‌ అబ్రహం ఫ్రాంచైసీ ఈ దఫా గెలువక పోయినా కనీసం డ్రాగానైనా ముగించాలని తహతహలాడుతున్నది. కనుక జట్టు సభ్యులందరినీ ఆటపై కేంద్రీకరించాలని వింగాడ సూచించాడు.

గత ఏడాది రెండో సీజన్‌లో ఫైనల్స్‌లో చెన్నైయిన్‌ చేతిలో పరాజయం పాలైన ఎఫ్‌సి గోవా టీం.. మరోసారి బ్రెజిలియన్‌ లెజెండ్‌ జికో సారధ్యంలో నార్త్‌ఈస్ట్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది.

బ్రెజిల్‌లో ప్రీ - సీజన్‌ శిక్షణలో పాల్గొన్న గోవా జట్టు నాలుగు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది. కోచ్‌ జికో కూడా వేర్వేరు ప్లేయర్లను వివిధ రకాల ఫార్మాట్లలో ఆడిస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నించారు.

అయితే జట్టుకు ఉన్న పరిమితుల్లో ఎవరెవరికి తొలి జట్టులో చోటు దక్కుతుందన్నది బహిర్గతంకాలేదు. గోవా జట్టులో చాలా మంది గాయాలతో చికిత్స పొందుతుండటమే దీనికి కారణం. వారిలో డిఫెండర్లు గ్రెగోరీ ఆమోలిన్‌, డెంజిల్‌ ఫ్రాన్స్‌కో, గోల్‌ కీపకర్‌ సుభాషిష్‌ రాయ్‌ చౌదరి, స్ట్రైకర్‌ రాబిన్‌సింగ్‌ చికిత్స పొందుతున్నారు.

NorthEast eye second straight home win against FC Goa

బ్రెజిలియన్లు, స్థానిక క్రీడాకారులతో కోర్‌ జట్టు కలిగి ఉన్న జికో తాజాగా జట్టులో చేరిన క్రీడాకారులు ట్రిండాడే గాంక్లేవ్స్‌, రాఫెల్‌ దుమాస్‌, జూలియో సీజర్‌, రిచర్ల్యైసన్‌లలో ఎవరికి తుది జట్టులోకి తీసుకుంటారో చెప్పక పోవడం గమనార్హం.

నార్త్‌ఈస్ట్‌పై ఎదురులేని విజయాల రికార్డు ఎల్లకాలం పనిచేయదని జికో అన్నాడు. ఏయేటికాయేడు టోర్నీలో కొత్తదనం ఉంటుందన్నాడు. తాము పాజిటివ్‌ దృక్ఫథంతో ముందుకు వెళతామన్నారు.

తాము అన్ని మ్యాచ్‌ల్లో గెలుపుకోసమే ఆడతామని వ్యాఖ్యానించారు. తమ జట్టు కుర్రాళ్లు పలు అంశాలపై ఆలోచిస్తూ ఉంటారని, ప్రస్తుతం వారు మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని జికో అన్నారు.

ప్రీ సీజన్‌ మ్యాచ్‌లు ఒకలా, లీగ్‌ మ్యాచ్‌లు మరోలా ఉంటాయన్నారు. తన జట్టులో పలువురు సభ్యులు గాయపడిన సంగతిని ఆయన అంగీకరించారు. అయినా తాము గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమని గోవా కోచ్‌ వ్యాఖ్యానించారు.

తమతో తలపడే నార్త్‌ఈస్ట్‌ జట్టులో పాజిటివ్‌గానీ, నెగెటివ్‌గానీ లేవని జికో అన్నారు. 72 గంటల్లోనే రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం కోసం సన్నద్ధమవుతున్న ఆతిథ్య జట్టు నార్త్‌ఈస్ట్‌కు అవకాశం కల్పిస్తే రోజూ ఆడతారన్నాడు.

ప్రారంభంలో ప్రతి ఒక్కరూ ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్న జికో.. తమ జట్టును చివరి వరకు పోటీలో నిలపడమే తమ లక్ష్యమన్నారు. నార్త్‌ఈస్ట్‌ జట్టుతో తలపడటం తమకు సాధారణమైన అంశమేనన్నారు. నార్త్‌ఈస్ట్‌ జట్టు కోచ్‌ వింగాడకు కొంత సానుకూల వాతావరణం ఉండొచ్చుగానీ ప్రభావితం చేయగల పరిస్థితి లేదని కొట్టి పారేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+