Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుణెపై విజయం: నార్త్ ఈస్ట్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

గౌహతి: పుణె సిటీపై జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టుకు నూతన జీవితం లభించింది. నాటకీయ ఫక్కీలో మ్యాచ్ గెలుచుకున్న జాన్ అబ్రహం సేన ప్లేఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా నిలుపుకున్నది. తొలి దశలో వరుస విజయాలతో సంచలనాలు నెలకొల్పిన నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు ఇంతకుముందు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయానికి దూరమైంది.

వాటిల్లో నాల్గింట ఓటమి పాలైంది. గత ఆరు మ్యాచ్‌ల్లో నార్త్ఈస్ట్ జట్టు కేవలం రెండు పాయింట్లు మాత్రమే పొందింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఐవరీకోస్ట్ మిడ్‌ఫీల్డర్ రోమరిక్ స్టన్నింగ్ రీతిలో 81వ నిమిషంలో గోల్ చేసి జట్టును సుదీర్ఘ విరామం తర్వాత నార్త్ఈస్ట్ టీంకు విజయం చేకూర్చి పెట్టాడు.

14 పాయింట్లతో ఆరో స్ధానంలో

14 పాయింట్లతో ఆరో స్ధానంలో

దీంతో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు గత 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికీ జాన్ అబ్రహం సేన హెడ్ కోచ్ నెలో వింగాడ ఇప్పటికీ తమ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలపై విశ్వాసంతో ఉన్నాడు. మరోవైపు 12 మ్యాచ్ లు ఆడిన ఎఫ్ సి పుణె జట్టు 15 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచినా.. మరో రెండు మ్యాచ్ లలోనూ గెలుపొందితేనే ప్లే ఆప్ దశలో చోటు దక్కించుకోగలుగుతుంది.

నార్త్ఈస్ట్, పుణె జట్ల మధ్య గట్టి పోటీ

నార్త్ఈస్ట్, పుణె జట్ల మధ్య గట్టి పోటీ

నార్త్ఈస్ట్, పుణె జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫస్ట్ సెషన్‌లో పలు స్పష్టమైన అవకాశాలు వచ్చినా బయట పడలేకపోయింది. మొమ్మర్ డోయే కొద్దిసేపు ఎడమవైపు చేసిన విన్యాసాలు కొంత వినోదాన్నిచ్చినా కొద్దిలో నార్త్ఈస్ట్ గోల్‌కీపర్ సుబ్రతాపాల్‌ను ఢీ కొట్టగలిగాడు. మిడ్ ఫీల్డర్ జొన్నాథన్ లుక్కా సైతం అంది వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఔట్ సైడ్ బాక్స్ నుంచి పంపిన బంతిని గోల్‌పోస్ట్‌కు పంపలేకపోయాడు.

లీడ్ అందుకోవడంలో ఫెయిల్

లీడ్ అందుకోవడంలో ఫెయిల్

కష్టపడి ఆడుతున్న నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టును గెలిపించేందుకు కస్తుమి యుసా పంపిన బంతిని పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె సేవ్ చేయడంతో జాన్ అబ్రహం సేన పాయింట్ సాధించలేక పోయింది. సెకండాఫ్‌లో ఎఫ్ సి పుణె సిటీ అన్ని అస్త్రాలు ప్రయోగించినా అనూహ్యంగా లీడ్ అందుకోలేకపోయింది. 69వ నిమిషంలో పుణె ప్లేయర్ లెన్నీ రోడ్రిగెస్ 35 గజాల దూరం నుంచి పంపిన బంతిని గోల్ కీపర్ సుబ్రతాపాల్ అడ్డుకోవడంతో క్రాస్ బార్ ముందు నుంచి వెళ్లిపోయింది.

 డేంజర్ జోన్ నుంచి పంపిన గోల్ కీపర్

డేంజర్ జోన్ నుంచి పంపిన గోల్ కీపర్

ఇజుమి ఆరాటా పంపిన బంతిని డేంజర్ జోన్ నుంచి పంపినా గోల్ కీపర్ సుబ్రతాపాల్ తప్పించిన తర్వాత స్పానిష్ మిడ్ ఫీల్డర్ పితూ మరోసారి గోల్ పోస్ట్ వద్దకు బంతిని పంపి గోల్ సాధించేందుకు ప్రయత్నించాడు. 81వ నిమిషంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు మ్యాచ్ విన్నింగ్ పాయింట్ గెలుచుకున్నది. రోమరిక్ ఔట్ సైడ్ బాక్స్ వద్ద నుంచి పంపిన ఫ్రీ కిక్ నేరుగా గోల్ పోస్ట్‌కు చేరుకోవడంతో నార్త్ ఈస్ట్ విజయం ఖరారైంది. పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె శరవేగంగా దూసుకొచ్చినా ఐవరీ కోస్ట్ మిడ్ ఫీల్డర్ రోమరిక్ టాప్ కార్నర్ ద్వారా నుంచి కొట్టిన కిక్ గోల్‌గా మారింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+