Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మాయిలను అదే పనిగా చూపిస్తే చర్యలు తప్పవ్..!!

No zooming in on hot female fans during World Cup 2018: Fifa tells broadcasters

హైదరాబాద్: ఏదైనా టోర్నీ జరుగుతుంటే మ్యాచ్ ఖాళీ సందర్భాల్లో స్టేడియంలో కూర్చున్న అమ్మాయిల వైపు కెమెరా కళ్లు తిరుగుతుంటాయి. వాళ్లనే కాసేపు ఫోకస్ చేసి చూపించడం పరిపాటిగా మారింది. అలాంటి చర్యలకు ఇక స్వస్థి పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తుంది ఫిఫా యాజమాన్యం... అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్‌ చేస్తూ కెమెరాలతో జూమ్‌ చేస్తే చర్యలు తప్పవని ఫిఫా ప్రపంచకప్‌ నిర్వాహకులు బ్రాడ్‌కాస్టర్‌లను హెచ్చరించారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీలో బ్రాడ్‌కాస్టర్‌​లు సెక్సీ అమ్మాయిలను పదేపదే చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని, దీనికి ఫిఫా వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే ఒక ఫుట్‌బాల్‌ ఆటలోనే కాకుండా అన్నీ క్రీడా టోర్నీల్లోను ఇలా అందమైన అమ్మాయిలను జూమ్‌ చేయడం టెలివిజన్‌ ప్రొడ్యూసర్లు ఓ అలవాటుగా మార్చుకున్నారు.

ఇప్పటిదేం కాకపోయినా..
ఈ తరహా సాంప్రదాయం 1970ల్లోనే మొదలైంది. దీనికి ఆద్యుడు అమెరికన్‌ టెలివిజన్‌ డైరెక్టర్‌ ఆండీ సిదారిస్‌. ఈ ఓల్డ్‌ మ్యాన్‌ క్రీడా టోర్నీల్లో 'హానీ షాట్స్‌' తీయడంపై ఆసక్తి కనబర్చేవాడు. ఇలా అమ్మాయిలను చూపించడం ఫుట్‌బాల్‌లోనే కాకుండా క్రికెట్‌లోను కనిపిస్తోంది.

టెలివిజన్‌ల తీరుపై ఫిఫా బాస్‌ ఫెడెరికో అడెక్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిని ఫిఫా ఉపేక్షించబోదని, వీటిపై ఓ పాలసీ రూపొందించి ఉక్కపాదం మెపుతామని ఆయన పేర్కొన్నాడు. రష్యాలో అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షించటానికి ఫేర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పైరా పవర్‌ తెలిపారు. సెక్సీజమ్‌ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓ సమస్యగా మారిందన్నారు. కొంత మంది ఆకతాయిలు సెక్సీ అమ్మాయిల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Story first published: Friday, July 13, 2018, 14:19 [IST]
Other articles published on Jul 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+