Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ 2018: సాకర్ సమరంలో సెక్స్ సూచనలు

No Sex With Foreigners During World Cup, Russian Lawmaker Warns

హైదరాబాద్: మరి కొద్ది గంటల్లో ఆరంభం కానున్న ఫిఫా సాకర్ ప్రపంచ కప్ సమరంతో ఇప్పటికే రష్యా వేడెక్కిపోయింది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లలో మునిగిన రష్యా.. అన్ని రకాలుగానూ ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఎంపీ ఒకరు అక్కడి మహిళలను విదేశీయులతో సెక్స్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరించింది. ప్రపంచకప్‌ చూసేందుకు వచ్చే అభిమానులతో సెక్స్‌లో పాల్గొంటే ఒంటరిగా పిల్లలను పెంచాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆమె చెప్పింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

విదేశీయుల పిల్లలకు తల్లులుగా

విదేశీయుల పిల్లలకు తల్లులుగా

తమారా ప్లెత్నెవా అనే ఆ 70 ఏళ్ల ఎంపీ పార్లమెంట్‌ కుటుంబ కమిటీకి నాయకత్వం వహిస్తోంది. ‘ప్రపంచకప్‌ సందర్భంగా రష్యా యువతులకు విదేశీయులతో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వారు తల్లులుగా మారొచ్చు. అలాంటి పరిస్థితి రాదని ఆశిస్తున్నా' అని ఆమె చెప్పింది.

మన పిల్లలకే జన్మనివ్వాలి

మన పిల్లలకే జన్మనివ్వాలి

‘మనం మన పిల్లలకే జన్మనివ్వాలి' అంది. భిన్న వర్ణాలకు జన్మించిన పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి దగ్గరే పెరిగే అవకాశముందని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘అదృష్టంకొద్దీ ఆ పిల్లలు తల్లుల వర్ణంతో పుడితే ఫర్వాలేదు. మరో వర్ణంలో పుడితే మాత్రం ఇబ్బందే. వాళ్లు చాలా బాధపడాల్సివస్తుంది' అని చెప్పింది.

ఎలాగైనా వాళ్లు ఒంటరే

ఎలాగైనా వాళ్లు ఒంటరే

‘ఆ పిల్లలను తల్లుల దగ్గరే వదిలేయొచ్చు లేదా తండ్రులు వారిని తమ వెంట తీసుకెళ్లొచ్చు. ఎలాగైనా వాళ్లు ఒంటరే అవుతారు' అని ఆమె అంది. రష్యా మహిళలు రష్యా పురుషులనే పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. ప్లెత్నెవా వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అందాలతో వల విసిరి తర్వాత బ్లాక్‌మెయిల్‌

అందాలతో వల విసిరి తర్వాత బ్లాక్‌మెయిల్‌

ఇంతకుముందు దీనికి వ్యతిరేకంగా నైజిరియా ఫుట్‌బాల్ కోచ్ గెర్నోట్ రోర్ రష్యా మహిళలతో సెక్స్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు రష్యన్లకు దూరంగా ఉండాలని చెప్పడానికి కారణం లేకపోలేదు. కొందరు అమ్మాయిలు, వ్యభిచారులు తమ అందాలతో వల విసిరి తర్వాత బ్లాక్‌మెయిల్‌ చేస్తారని భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Story first published: Thursday, June 14, 2018, 11:52 [IST]
Other articles published on Jun 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+