Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేరళ ప్రభుత్వం చొరవ: వినీత్‌కు మళ్లీ గవర్నమెంట్ ఉద్యోగం

No response from Central government, Kerala state hands footballer CK Vineeth a job

హైదరాబాద్: తక్కువ హాజరు శాతం కారణంగా భారత ఫుట్‌బాల్ ఆటగాడు సీకే వినీత్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం అతడికి మరో ఉద్యోగం లభించింది. స్పోర్ట్స్ కోటా కింది కేరళ సెక్రటేరియట్‌లోని సాధారణ పరిపాలన విభాగంలో అసిస్టెంట్‌గా నియమితుడయ్యాడు.

ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాకు అధికారికంగా ప్రకటన చేశారు. అంతకు ముందు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో వినీత్ ఆడిటర్‌గా పనిచేశాడు.

అయితే పుట్‌బాల్ మ్యాచ్‌లకు హాజరుతుండటం వల్ల విధులకు తరచూ గైర్హాజరు కావాల్సి వచ్చేది. దీంతో మే7 2016న అతడిని విధుల నుంచి తొలగించారు. వినీత్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Thursday, November 30, 2017, 11:07 [IST]
Other articles published on Nov 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+