Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రొయేషియా అధ్యక్షురాలిపై ప్రశంసల జల్లు కురిపిస్తోన్న నెటిజన్లు

No hard feelings: Croatian President embraces French leader at full-time [video]

హైదరాబాద్: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌తో పోరాడి ఓడిన క్రొయేషియాను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారు. దానికి కారణం ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటోరొవిచ్. కేవలం 41లక్షల దేశ జనాభా ఉన్న క్రొయేషియా ఫిఫా సమరంలో ఫైనల్ వరకూ చేరుకోగలిగింది. దీంతో ఫైనల్‌లో జట్టు ఆటను నేరుగా వీక్షించేందుకు ఆ దేశాధినేత కదిలివచ్చారు. స్టేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షించిన ఆమె తమ జట్టు ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లను సముదాయించిన తీరు అందరినీ కట్టిపడేసింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

విజయకాంక్షతో బరిలోకి దిగిన రెండు జట్లు.. మ్యాచ్ చివరి నిమిషం వరకూ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఫ్రాన్స్ విజేతగా నిలవడంతో.. ఆ దేశాధ్యక్షుడు సంబరాలు చేసుకున్నారు. అతనితో పాటుగా కొలిండా కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు అభినందనలు పంచుకునే క్రమంలో హత్తుకుని బుగ్గలపై ముద్దులు పెట్టుకున్నారు. రష్యన్ అధ్యక్షుడితో కలిసి స్టేడియంలో శుభాకాంక్షలు పంచుకున్నారు. ఇంకా క్రొయేషియా జట్టు ఆటగాళ్ల ఓటమిపై కూడా ఆవిడ అదే తరహాలో సముదాయించారు. ఫైనల్ వరకూ వచ్చినందుకుగాను వారిని ఒక్కొక్కరికీ కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో వారితో కలిసి ఫొటోలు దిగి కుటుంబ వాతావరణాన్ని కలుగజేశారు. ఆతిథ్య రష్యా దేశాధినేత పుతిన్ స్టేడియంలో వర్షం పడుతున్న సమయంలో పెద్ద గొడుగుతో కనీసం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఫ్రాన్స్, క్రొయేషియా దేశాధ్యుక్షులు వాన గురించి ఆలోచించకుండా.. ఆటను చూసేందుకే మొగ్గు చూపారు. ఈ గొడుగు విషయంపై కూడా నెటిజన్లు విమర్శలు కురిపిస్తుండగా.. ఫ్రాన్స్, క్రొయేషియా అధ్యక్షుల పట్ల ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.

1
958085

క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్‌ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని.లో), మాన్‌జుకిచ్‌ (69వ ని.లో) గోల్స్‌ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2-1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్‌ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. మరి కొద్ది నిమిషాలలో మ్యాచ్ ముగుస్తుందనగా.. క్రొయేషియాకు వృథా ప్రయాస మిగిలింది. దీంతో ఫ్రాన్స్‌ సునాయస విజయం అందుకుంది.

Story first published: Monday, July 16, 2018, 12:43 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+