Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన నీతా అంబానీ (ఫోటో)

న్యూఢిల్లీ: భారత్‌లో పుట్‌బాల్‌కు ప్రజాదరణ పెంచే ఉద్దేశ్యంతో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ట్రోఫీని ఆదివారం పుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ (ఎఫ్‌ఎస్‌డీ) ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆయా ప్రాంజైజీల తరుపున బరిలోకి దిగబోతున్న అంతర్జాతీయ పుట్‌బాల్ దిగ్గజాలు ఫ్రెడెరిక్ జుంగ్ బర్గ్, డెల్ పియరో, క్యాప్ డెవిలా, డేవిడ్ ట్రెజెగుట్, రాబర్ట్ పిరాస్, లూయిస్ గార్సియా, డేవిడ్ జేమ్స్ పాల్గోన్నారు.

Nita Ambani unveils Hero ISL trophy

ఈ కార్యక్రమంలో నీతా అంబానీ మాట్లాడుతూ ఇది నిజంగా మా అందరికీ చిరస్మరణీయమైన రోజు. ఇండియన్ సూపర్ లీగ్ ట్రోపీని అవిష్కరించేందుకు నేను ప్రపంచ పుట్ బాల్ దిగ్గజాల సరసన నిలబడ్డాను. విశ్వవ్యాప్తంగా వీరు ఇప్పటికే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. భారత్‌లో కూడా ఈ ట్రోపీ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

ఫ్రేజర్ అండ్ హాస్ డిజైన్ చేసిన ఈ ట్రోపీ ఎత్తు 26 అంగుళాలు. ఈ ట్రోఫీ పైభాగంలో ఇండియన్ సూపర్ లీగ్ లోగోను ముద్రించారు. ఈ సూపర్ లీగ్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి.

మాజీ క్రికెట్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ ఇందులో రెండు జట్లకు యజమానులుగా ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+