
హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్ పోటీలు అనూహ్య ఫలితాలు తెచ్చి పెడుతున్నాయి. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ టోర్నీలో.. లీగ్ దశ చివరికి చేరడంతో పలు జట్ల మధ్య మ్యాచ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో రికార్డు నమోదైంది. అదేంటంటే... ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే అత్యధిక పెనాల్టీ గోల్స్ నమోదవ్వడం.
గతంలో ఏ ప్రపంచకప్ టోర్నీ మొత్తంలో నమోదుకానన్ని పెనాల్టీ గోల్స్ ఈ ఏడాది లీగ్ దశ ముగియకముందే నమోదు అయ్యాయి. సోమవారం స్పెయిన్-మొరాకో, ఇరాన్-పోర్చుగల్ మధ్య మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఈ ప్రపంచకప్‌లో 20 పెనాల్టీ గోల్స్ నమోదయ్యాయట. 1990లో ఇటలీలో జరిగిన ప్రపంచకప్‌లో టోర్నీ మొత్తం కలిపి 18 పెనాల్టీ గోల్స్ నమోదవ్వడమే ఇప్పటి వరకూ అధికం. ఆ తర్వాత 1998, 2002లో జరిగిన ప్రపంచకప్‌ల్లోనూ 18 మాత్రమే నమోదయ్యాయి. 2014లో టోర్నీ మొత్తం కలిపి 13 పెనాల్టీ గోల్స్ నమోదయ్యాయి.
గతంలో ఏ ప్రపంచకప్‌లో వాడని వార్ (వీడియో అసిస్టెంట్ రిఫరీ) టెక్నాలజీని ఈ ప్రపంచకప్‌లో వాడటం వల్ల కూడా పెనాల్టీ గోల్స్ ఎక్కువగా నమోదవుతున్నట్లు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు.
అయితే మంగళవారం అర్జెంటీనా, నైజీరియాల మధ్య జరిగిన మ్యాచ్ లో మరో పెనాల్టీ గోల్ నమోదు చేసుకునే అవకాశాన్ని అర్జెంటీనా మిస్ చేసుకుంది. వ నిమిషంలో పెనాల్టీ గోల్‌ను స్ట్రయిక్ చేసే అవకాశం మెస్సీకి వచ్చింది. అయితే మ్యాచ్ మధ్యలో ఉండగా లభించిన పెనాల్టీని మెస్సీ సరిగా వాడులోకపోయాడు. అది కాస్తా గోల్ పాయింట్ పక్కగుండా పోయింది.