For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్కంఠ పోరు: దక్షిణాఫ్రికాపై నైజీరియా విజయం

By Stats Perform

ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫైనల్స్‌కు నైజీరియా ఎనిమిదో సారి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాపై పెనాల్టీ షూట్ అవుట్‌లో 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. నైజీరియా గెలుపులో గోల్ కీపర్ స్టాన్లీ న్వాబాలీ కీలకపాత్ర పోషించాడు. టెబోహో మోకోనా, మక్‌గోపా భీకర గోల్స్‌ను అడ్డుకుని స్టాన్లీ నైజీరియా హీరో అయ్యాడు.

అయితే మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు ఖాతా తెరవలేదు. రెండో అర్ధభాగంలోనే అసలు మజా మొదలైంది. సెకండ్ హాఫ్ ప్రారంభమైన కొద్దిసేపటికీ నైజీరియా గోల్ సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 85వ నిమిషం వరకు నైజీరియాదే జోరు. కానీ ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Ivory Coast AFCON Soccer

90వ నిమిషంలో VARతో దక్షిణాఫ్రికాకు పెనాల్టీ షూట్ అవకాశం దక్కింది. టెబోహో మోకోనా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మెరుపు గోల్‌తో 1-1తో స్కోరును సమం చేశాడు. అప్పటికే మ్యాచ్‌ సమయం ముగిసింది. సెమీఫైనల్స్ అవ్వడంతో రిఫరీ మ్యా‌చ్‌ను మరో 30 నిమిషాల పాటు కొనసాగించాడు.

15 నిమిషాల పాటు రెండు అర్ధభాగాలుగా నిర్వహించారు. అయితే ఇరు జట్ల ప్లేయర్లు గొప్పగా పోరాడినప్పటికీ గోల్స్ సాధించలేకపోయారు. దీంతో మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది.

పెనాల్టీ షూటౌట్‌లో నైజీరియా 4-2 తేడాతో విజయం సాధించింది. టెరెమ్ మోఫీ గోల్ చేసి నైజీరియా ఖాతా తెరిచాడు. కానీ ఆ తర్వాత టెబోహో మోకోనా గోల్ సాధించకపోవడంతో సౌతాఫ్రికా వెనుకబడింది. అనంతరం నైజీరియా అదే దూకుడును కొనసాగించి విజయం సాధించింది.

Story first published: Thursday, February 8, 2024, 17:18 [IST]
Other articles published on Feb 8, 2024
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+