ముంబైలో పుట్‌బాల్ మ్యాచ్: ధోని Vs ప్రియాంకకు కాబోయే భర్త


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్‌తో పాటు పుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. భారత జట్టు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ధోని అనేకసార్లు పుట్‌బాల్ ఆడటాన్ని మనం చూశాం. తాజాగా ధోని క్రికెట్‌లోనే కాదు పుట్‌బాల్‌లో సైతం గొప్ప కెప్టెన్ అని నిరూపించుకున్నాడు.

నిక్ జొనాస్ Vs ధోని
ఆదివారం ముంబైలో జరిగిన ఈ పుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రముఖ అమెరికన్ సింగర్, ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త నిక్ జొనాస్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రి సింగ్ ధోని జట్టుతో తలపడింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ ప్రముఖులు ఆదిత్య రాయ్ కపూర్, ఇషాన్ ఖట్టర్, కునాల్ ఖేము తదితరులు పాల్గొన్నారు.

ధోని సతీమణి సాక్షి సైతం
ఈ మ్యచ్‌ని వీక్షించేందుకు ప్రియాంక చోప్రా, ధోని సతీమణి సాక్షి కూడా స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. నిక్ జొనాస్‌కు పుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిక్ జొనాస్ కిందపడి గాయపడ్డారు.

ముంబైలో ఘనంగా నిక్, ప్రియాంక నిశ్చితార్థం
అయినప్పటికీ ఆటను కొనసాగించడం విశేషం. ఆగస్టులో నిక్, ప్రియాంక నిశ్చితార్థం ముంబైలో ఘనంగా జరిగింది. ఇటలీలో ఇషా అంబానీ నిశ్చితార్థానికి హాజరైన ఈ జంట ఇటీవలే ముంబైకి చేరుకుంది. ఈ నెల మొదట్లో నిక్ తన 26వ పుట్టినరోజుని తనకు కాబోయే భార్య ప్రియాంక చోప్రా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాడు.

నవంబర్‌లో నిక్‌ను పెళ్లాడనున్న ప్రియాంక
ఇటీవలే ఈ జోడీ మెక్సికో ట్రిప్‌కు సైతం వెళ్లొచ్చారు. నవంబర్‌లో అమెరికాలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భారత్‌లో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications