For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'నా లాస్ట్ షాట్ అదే' - దిగ్గజ ఫుట్ బాలర్ షాకింగ్ డెసిషన్

బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నేమార్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఫిఫా 2026 వరల్డ్ కప్ తాను ఆడబోయే చివరి టోర్నీ అని అన్నాడు. అలానే దిగ్గజ ఫుట్ బాలర్స్ మెస్సీ, సూరెజ్ తో రీయూనియన్ విషయమై హింట్ ఇచ్చాడు.

నేమార్ కు గాయాలు
79 గోల్స్ తో బ్రెజిల్ ఆల్ టైమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు నేమార్. అయితే 32 ఏళ్ల నేమార్ కెరీర్ లో ఎన్ని ఘనతలు సాధించాడో, అలానే గాయాల బారిన కూడా పడ్డాడు. దీంతో ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మ్యాచులలోనే బరిలోకి దిగాడు. 2023లో పారిస్ సెయింట్ జెర్మెన్ నుంచి బయటకొచ్చిన కేవలం ఏడు మ్యాచులలోనే ఆడాడు. సౌదీ ప్రో లీగ్ క్లబ్ వారితో అతడి కాంట్రాక్ట్ 2024 జూన్ తో ముగిసిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నేమార్ తన కెరీర్ భవిష్యత్ ప్రణాళిక గురించి హింట్ ఇచ్చాడు. రిటైర్మెంట్ గురించి కూడా వ్యాఖ్యలు చేసాడు. మేజర్ లీగ్ సాసర్ బరిలో దిగడంతో పాటు మాజీ బార్సిలోనా టీమ్ మేట్స్ లియోనెల్ మెస్సీ, లూయిస్ సూపెజ్ తో రీయూనియన్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

Neymar s retirement hint says 2026 World Cup will be his last hints at reunion with Messi Suarez

"నేను ఆడేందుకు ప్రయత్నిస్తాను. కచ్చితంగా ఆడుతాను. నా నేషనల్ టీమ్ కోసం, జట్టుతో ఉండేందుకు చేయాల్సినవన్నీ చేస్తాను. ఇక ఇదే నా చివరి వరల్డ్ కప్. నా లాస్ట్ షాట్, నా లాస్ట్ ఛాన్స్ ఇదే. కాబట్టి నేను ఈ ప్రపంచ కప్ లో ఆడేందుకు ఏదైనా చేస్తాను." అని పేర్కొన్నాడు.

మేం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం
నేమార్ , మెస్సీ, లూయిస్.. గతంలో ఈ త్రయం కలిసి అద్భుత రికార్డులను సాధించారు. వీరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. తాజాగా వారితో రీయూనియన్ గురించి నేమార్ మాట్లాడుతూ... "మెస్సీ, లూయిస్ తో కలిసి మళ్లీ ఆడటం అనేది అసాధరణమైన విషయం. వాళ్లు నా స్నేహితులు. మేం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేను అల్ హిలాల్, సౌదీ అరేబియాతో హ్యాపీగానే ఉన్నాను. ఫుల్ బాల్ అంటేనే ఎన్నో సర్ ప్రైజెస్." అని చెప్పుకొచ్చాడు. కాగా, బ్రెజిల్ జట్టు ప్రస్తుతం సౌత్ అమెరికన్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో ఐదో స్థానంలో ఉంది.

Story first published: Wednesday, January 8, 2025, 17:37 [IST]
Other articles published on Jan 8, 2025
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+