Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్‌బాల్ కాదు.. నెయ్‌మార్‌లా నటిస్తున్నారు..!!

Neymar trolley a group of children in Switzerland

హైదరాబాద్: నెయ్‌మార్‌ను విమర్శించడం ఈ సారి పిల్లల వంతైంది. జూన్ 2 సోమవారం మెక్సికోతో బ్రెజిల్ ఆడిన మ్యాచ్‌లో నెయ్‌మార్ చేసిన విన్యాసాలకు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యాయి. ఫిఫా కప్‌లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడ్‌ నెయ్‌మార్‌ తనదైన 'రోలింగ్‌ కళ'కు కచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందేనంటూ ట్విటర్‌లో ఫుట్‌బాల్ అభిమానులు తీర్మానించారు కూడా. అయితే అతడి తీరుపై మెక్సికో జువాన్ క్లారియో మండిపడటం, బ్రెజిల్ కోచ్‌ నెయ్‌మార్‌ను వెనుకేసుకు రావడం అన్నీ అయ్యాయి.

పిల్లలు కూడా అచ్చం నెయ్‌మార్ లాగే

అయితే ఇప్పుడు ఆ రోలింగ్ కళకు సంబంధించి స్పూఫ్‌ వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో స్విట్జర్లాండ్ చిన్నారులు కలిసికట్టుగా చేసిన రోలింగ్ కళ విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారందరూ ఫుట్‌బాల్‌ను తన్నుకుంటూ కొంత దూరం వచ్చాక ఒక్కసారిగా కిందపడి పొర్లాడుతూనే ఉంటారు. అచ్చంగా నెయ్‌మార్‌లానే దొర్లుతూ దెబ్బతగిలినట్లు తెగ నటించేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

టచ్‌లైన్‌ వైపునకు వెళ్తుండగా నెయ్‌మార్‌ కాలికి:

ఆట 70వ నిమిషంలో నెయ్‌మార్‌ బాల్‌ను డ్రిబిల్‌ చేసుకుంటూ టచ్‌లైన్‌ వైపునకు వెళ్తుండగా మెక్సికో క్రీడాకారుడు మిగ్యూల్‌ బంతిని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని కాలు నెయ్‌మార్‌ కాలికి తగిలింది. అంతే నెయ్‌మార్‌ కిందపడి బాధతో విలవిల్లాడిపోతున్నట్లు మైదానంలో పొర్లాడాడు. దీంతో ఆటను 4 నిమిషాలపాటు నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం మళ్లీ లేచి ఆటను కొనసాగించాడు. అతను ఇటువంటి కళలో సిద్ధహస్తుడని పేరుండటంతో ట్విటర్‌లో ట్రోలింగ్‌ మొదలైంది.

ఎప్పుడు జరిగిందంటే:

టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. వరల్డ్‌కప్ ప్రారంభమైనప్పటి నుంచి టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలెదుర్కొంటున్న నెయమార్ జూలై 2 సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి అర్థబాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నెయ్‌మార్ 51వ నిమిషంలో గోల్‌ సాధించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.

ఇలానే జరిగింది:

చివర్లో మెక్సికో కొంచెం దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఇక మరికొద్ది క్షణాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా మిడ్‌ఫీల్డర్‌ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో 88వ నిమిషంలో గోల్‌ సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో నెయ్‌మార్ ఆటతీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో ఫిఫా ప్రపంచ కప్‌ క్వార్టర్‌ ఫైనల్ అంకానికి తెరలేవనుంది. బ్రెజిల్ భారీ అంచనాలున్న బెల్జియంను ఢీకొంటుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో ఉరుగ్వేను ఫ్రాన్స్‌ ఢీకొంటుంది. బలమైన రక్షణ శ్రేణి ఉరుగ్వే బలమైతే.. పదునైన ఎటాకింగ్‌ ఫ్రాన్స్‌ సొంతం.

Story first published: Friday, July 6, 2018, 15:29 [IST]
Other articles published on Jul 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+