Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రియో షూటౌట్ పెనాల్టీ ఇప్పటికీ చిరస్మరణీయమే'

బార్సిలోనా: ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ ఫైనల్స్‌లో జర్మనీతో జరిగిన టైటిల్ పోరులో షూటౌట్ ద్వారా చివరి పెనాల్టీ ఇప్పటికి అత్యంత ఆసక్తిదాయక క్షణంగా నిలిచిపోతుందని బార్సిలోనా ఎఫ్ సి, బ్రెజిల్ ఫుట్ బాలర్ నేయ్మార్ అంగీకరించాడు. ఫుట్ బాల్ విభాగంలో రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ జట్టుకు స్వర్ణ పతకం సాధించి పెట్టిన తన షూటౌట్ పెనాల్టీ ఎప్పటికి మరిచిపోలేనన్నాడు.

నాటి మ్యాచ్‌లో అదనపు సమయం ముగిసిన తర్వాత కూడా జర్మనీ, బ్రెజిల్ 1 - 1 స్కోర్‌తో సమ ఉజ్జీలుగా నిలవడంతో తర్వాత నిర్వహించిన షూటౌట్‌లో జర్మనీపై బ్రెజిల్ 5 - 4 స్కోర్ తేడాతో విజయం సాధించింది. తాను నడుస్తున్నప్పడు కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటానని నేయ్మార్ అన్నాడు.

'ఇది నా జీవితంలో ఆసక్తికరమైన, ఎల్లవేళలా గుర్తుంచుకునే క్షణం. దేవుడి పట్ల ప్రేమతో ఉన్నందు వల్లే నేను ఆ బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించగలిగాను. అప్పుడు దేవుడు నాకు శక్తినిచ్చినందునే నిశ్శబ్దంగా బంతిని కిక్ చేశాను' అని తెలిపాడు.

Neymar says last penalty kick at Rio Games was his most anxious moment

ఫ్యాన్స్ మద్దతు పట్ల ఈస్ట్ బెంగాల్ అసిస్టెంట్ కోచ్ ఆశ్చర్యం

వచ్చేనెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐ-లీగ్ టోర్నీ కోసం తాము చేపట్టిన ప్రాక్టీస్ ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులను చూసిన ఈస్ట్ బెంగాల్ అసిస్టెంట్ కోచ్ హక్కెట్ట్ ఆశ్చర్య చకితుడయ్యాడు. శిక్షణ సమయంలో భారీగా అభిమానులు రావడం చాలా సానుకూల పరిణామం అని అన్నాడు. ఇటువంటి పరిస్థితిని తానెప్పుడూ ఇంగ్లండ్‌లో చూడలేదన్నాడు.

వివిధ జట్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్స్ భారీ స్థాయిలో మద్దతు పలుకడం తనకెప్పుడు అనుభవంలోకి రాలేదని హక్కెట్ అన్నాడు. అయితే అతిపెద్ద క్లబ్ జట్ల ప్రాక్టీస్ సమయంలో ఫ్యాన్స్ ముందుకు వస్తారని, దీనిబట్టి భారత్ లోని అతిపెద్ద ఫుట్ బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ ఒకటి అని పేర్కొన్నాడు.

కోల్‌కతా సిటీతోపాటు బెంగాల్ లోని వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా అభిమానులు ప్రాక్టీస్‌ను వీక్షించేందుకు వచ్చారు. ఈస్ట్ బెంగాల్ హెడ్ కోచ్ మోర్గాన్ ట్రెవర్ తనను జట్టుకు కోచ్‌గా రావాలని ఆహ్వానించడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారత్‌కు వచ్చానన్నాడు. ఇంతకుముందు కూడా ట్రెవర్ తనకు మంచి స్నేహితుడని అన్నాడు.

మోర్గాన్‌తోపాటు తన ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని, ఒక కోచ్‌గా ట్రెవర్‌తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారన్నాడు. యూరోపియన్ యూనియన్ లైసెన్స్‌డ్ కోచ్‌ల్లో హక్కెట్ ఒకడు. కొందరు మంచి ప్లేయర్లు ఉంటే పిచ్ నైస్‌గా ఉంటే గుడ్ టీం తయారుచేయవచ్చునన్నాడు. ఈస్ట్ బెంగాల్ జట్టు జనవరి ఏడో తేదీన ఐజ్వాల్ ఎఫ్ సి జట్టుతో తొలిసారి తలపడుతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+