బ్రెజిల్‌కు బిగ్ షాక్.. సూపర్ స్టార్ నెయ్‌మర్ ఔట్!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ నెయ్‌మర్ గాయంతో గ్రూప్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మొరాకోతో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బ్రెజిల్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
పిక్క గాయంతో నెయ్‌మర్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడని బ్రెజిల్ కోచ్ కార్లో వెల్లడించాడు. అయితే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నింటీకి అతను దూరమయ్యే ప్రమాదం ఉందని ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి.

అదే జరిగితే బ్రెజిల్ ప్రపంచకప్ ఆశలు ఆవిరైనట్లే. గ్రూప్ ఎఫ్‌లో ఉన్న బ్రెజిల్.. జూన్ 19న హైతీతో, జూన్ 24న స్కాట్లాండ్‌తో తలపడనుంది. అప్పటికైనా కోలుకుని నెయ్‌మర్ జట్టులోకి వస్తాడనే గ్యారంటీని బ్రెజిల్ కోచ్ కూడా ఇవ్వలేదు.
'వీలైనంత త్వరగా కోలుకునేందుకు నెయ్‌మర్ ప్రయత్నిస్తున్నాడు. తప్పకుండా వచ్చేవారం నాటికి అతను పూర్తిగా ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్ ఆడుతాడని ఆశిస్తున్నాం. జట్టులోని కుర్రాళ్లకు అతనే మార్గదర్శి. ఆరో టైటిల్ నెగ్గాలనే బ్రెజిల్ కలను సాకారం చేసుకునేందుకు నెయ్‌మర్ అనుభవం పనికొస్తుంది. అతను లేకుండా ఎలా ఆడాలనేదానిపై మేం వ్యూహాలు రచించాం. మా ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు.'అని కోచ్ కార్లో యాన్సెలొట్టి తెలిపాడు.
నెయ్‌మార్.. 2023 తర్వాత బ్రెజిల్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడలేదు. మే రెండోవారంలో కుడి కాలికి గాయంతో ఆటకు దూరమయ్యాడు. 34 ఏళ్ల ఈ ఫార్వర్డ్ ప్లేయర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ బ్రెజిల్ వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం నాటికి అతను కోలుకుంటాడని ఆశించారు. మొరాకోతో జరిగే మ్యాచ్ నాటికి కూడా ఫిట్ నెస్ లో పెద్దగా మార్పులు లేకపోవడంతో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

