Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయంపై మానసిక సంఘర్షణ నుంచి బయటపడాల్సి ఉన్నదన్న నేయ్మార్

Neymar reveals World Cup injury fear

హైదరాబాద్: బ్రెజిల్ ఫార్వర్డ్ ఆటగాడు నేయ్మార్ తనకు జరిగిన గాయంతో మానసికంగా ఇంకా కోలుకోలేదని తెలిపాడు. రష్యాలో వచ్చేనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సాకర్ కప్ టోర్నమెంట్‌లో హాజరు కాగలనా? అని సందేహిస్తున్నానని నేయ్మార్ చెప్పాడు. సాకర్ కప్‌కు హాజరు కావడానికి మానసిక సంఘర్షణ నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నదని వివరించాడు. ఫిబ్రవరిలో కుడి పాదానికి గాయమైనప్పటి నుంచి ఫారిస్ సెయింట్ జెర్మైన్ జట్టు తరఫున ఆటకు దూరంగా ఉన్నాడు.

శస్త్ర చికిత్స కోసం మార్చిలో బ్రెజిల్‌కు నేయ్మార్

శస్త్ర చికిత్స కోసం మార్చిలో బ్రెజిల్‌కు నేయ్మార్

బ్రెజిలియన్ సిటీ బెలో హొరిజొంటెలో శస్త్రచికిత్స కోసం గత మార్చి మూడో తేదీన వెళ్లిన నేయ్మార్.. చికిత్స పూర్తయిన తర్వాత గతవారం పారిస్ నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి తాను వాకింగ్ ప్రారంభించానని, భయం నుంచి బయట పడాల్సి ఉన్నదని చెప్పారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోగా త్వరితగతిన తాను కోలుకోవాల్సిన అవసరం ఉన్నదని నేయ్మార్ తెలిపాడు.

వచ్చేనెల 17వ తేదీన స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్ ఢీ

వచ్చేనెల 17వ తేదీన స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్ ఢీ

బ్రెజిల్ జట్టు వచ్చేనెలలో రష్యాలో ప్రారంభమయ్యే ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో జూన్ 17వ తేదీన స్విట్జర్లాండ్ జట్టుతో తల పడనున్నది. గతేడాది ఆగస్టులో బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జెర్మైన్ జట్టులో చేరిన నేయ్మార్ ప్రపంచంలోనే అత్యధికంగా 264 మిలియన్ల డాలర్ల వేతనం అందుకుంటున్నాడు. అన్ని టోర్నమెంట్లలో 28 గోల్స్ సాధించిన నేయ్మార్.. ఆయన ప్రాతినిద్యం వహించిన జట్టు సభ్యులు మరో 16 గోల్స్ సాధించడంలో సహకరించాడు. బార్సిలోనాలో నాలుగు సీజన్లు ఆడిన నేయ్మార్.. లియానెల్ మెస్సీ, లూయిస్ సురెజ్‌లతో భాగస్వామ్యం వహించాడు.

రియల్ మాడ్రిడ్ సారధి సెర్జియో రామోస్‌కు గాయం

రియల్ మాడ్రిడ్ సారధి సెర్జియో రామోస్‌కు గాయం

లా లీగ టోర్నీలో సెల్టా విగో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ కెప్టెన్ సెర్జియో రామోస్‌కు గాయమైంది. డానీ కార్వాజాల్, స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతోపాటు రైట్ బ్యాక్ ప్లేయర్ సెర్జియో రామోస్ జట్టులో కీలక పాత్ర పోషించాడు.

యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ ఫైనల్స్‌లో

యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ ఫైనల్స్‌లో

యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ ఫైనల్స్‌లో లివర్‌పూల్ జట్టుతో జరిగే ఈ నెల 26వ తేదీన మ్యాచ్ కోసం రియల్ మాడ్రిడ్ జట్టు కెప్టెన్ సెర్జియో రామోస్‌ను పక్కనబెట్టాలని కోచ్ జినెడినె జిడానే నిర్ణయించాడు. డానీ సెబల్లోస్, మార్కొస్ ల్లొరెంట్‌ వంటి మిడ్ ఫీల్డర్లను పక్కనబెట్టాలని తీసుకున్నాడు.

Story first published: Wednesday, May 23, 2018, 14:00 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+