Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బార్సిలోనాతోనే మెస్సీ: నేయ్మార్ ఆశాభావం

బార్సిలోనా: లా లీగ జెయింట్స్ టీం ఎఫ్ సి బార్సిలోనా ఆటగాడు, బ్రెజిలియన్ నేయ్మార్ తన సహచర ప్లేయర్ స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీ భవిష్యత్‌లో దీర్ఘకాలం పాటు బార్సిలోనాతోనే ఫుట్ బాల్ కెరీర్ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. లియానెల్ మెస్సీ (29) ఒకసారి ఫ్రాంచైసీ యాజమాన్యంతో ఒప్పందంపై సంతకాలు చేయడం ఒక్కటే మిగిలి ఉందన్నాడు.

కొన్ని వారాలు, నెలల్లో మెస్సీకి బార్సిలోనా యాజమాన్యం కొత్త ప్రతిపాదనతో నూతన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వస్తుందన్నాడు. ప్రస్తుత కాంట్రాక్ట్ 2018 జూన్ 30తో ముగుస్తుంది. బార్సిలోనాలో సహచర ప్లేయర్ నేయ్మార్ కూడా అర్జెంటీనా స్టార్ ఇక ముందు కూడా క్యాంప్ నౌతోనే కొనసాగాలని భావిస్తున్నాడు.

త్వరలో మెస్సీకి, క్లబ్ యాజమాన్యానికి మధ్య కొత్త ఒప్పందం కుదురుతుంది. ఇంకా మెస్సీతో సంప్రదింపులు ప్రారంభించలేదని బార్సిలోనా అధ్యక్షుడు జోసెఫ్ మారియా బార్టోమ్యూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'లియానెల్ మెస్సీ మాతోనే ఉంటాడని భావిస్తున్నా' అని రెండు రోజుల క్రితం సావో పాలోలో మీడియాతో అన్నాడు.

త్వరలో మెస్సీ ఒప్పందం కుదుర్చుకుంటాడని అంచనా

త్వరలో మెస్సీ ఒప్పందం కుదుర్చుకుంటాడని అంచనా

త్వరలో మెస్సీ ఒప్పందం కుదుర్చుకుంటాడని అంచనా వేస్తున్నామన్న జోసెఫ్.. అందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చాడు. ప్రస్తుత లాలీగ టోర్నీలో బార్సిలోనా తన ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే మూడు పాయింట్లు తక్కువతో రెండోస్థానంలో కొనసాగుతున్నది. నేయ్మార్ 13 మ్యాచ్‌లలో నాలుగు గోల్స్ మాత్రమే చేశాడు.

అసిస్టెన్స్ లతో చాలా హ్యాపీగా ఉన్నా

అసిస్టెన్స్ లతో చాలా హ్యాపీగా ఉన్నా

కానీ జట్టు లీడ్ లో కొనసాగేందుకు ఆరు అసిస్టెన్స్‌లు అందజేశాడు. ‘వారు సహజంగానే హ్యాపీగా ఉంటారు. నేను అసిస్టెన్స్ లతో చాలా హ్యాపీగా ఉన్నా. టీంకు మరింత సాయం చేయాలని నేను కోరుకుంటున్నా' అని నేయ్మార్ తెలిపాడు. వచ్చేనెల ఎనిమిదో తేదీన లా లీగ టోర్నీలో భాగంగా విల్లార్రెల్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు బార్సిలోనా అందుబాటులోకి వస్తాడు.

సోషల్ మీడియా కింగ్ రొనాల్డో

సోషల్ మీడియా కింగ్ రొనాల్డో

ఈ ఏడాది సోషల్ మీడియా ఫుట్‌బాల్ కింగ్‌గా పోర్చుగల్ ఫార్వర్డ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు మార్మోగుతున్నది. చాంపియన్స్ లీగ్, యూరో 2016 కప్, క్లబ్ వరల్డ్ కప్ టైటిళ్లకు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డోనూ సోషల్ మీడియా ప్రశంసల్లో ముంచెత్తుతున్నది. రొనాల్డొ తాను ప్రాతినిధ్యం వహించిన రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు, తన పోర్చుగల్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహించడంతోపాటు వ్యక్తిగతంగా, దేశీయంగా, క్లబ్ పరంగా పేరు తెచ్చుకున్నాడు.

సారథిగా యూరో 2016 కప్ సాధించి పెట్టిన క్రిస్టియానో రొనాల్డో

సారథిగా యూరో 2016 కప్ సాధించి పెట్టిన క్రిస్టియానో రొనాల్డో

రియల్ మాడ్రిడ్ క్లబ్ తరఫున చాంపియన్స్ లీగ్, క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ టైటిల్, పోర్చుగల్ జాతీయ జట్టుకు సారథిగా యూరో 2016 కప్ సాధించి పెట్టాడు. హై ప్రొఫైల్ గల అథ్లెట్‌గా ఫేస్ బుక్ లో మూడోస్థానం, ఇంస్టాగ్రామ్ లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 3.4 కోట్ల మంది అభిమానులు ఆయన్ను లైక్ చేశారు. యూరో 2016 క్లబ్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు ఆయన కుమారుడి జన్మ దినోత్సవ వేడుకులో పోర్చుగల్ స్క్వాడ్ తో విమానంలోనే జరుపడంతో పోస్టులు 74 లక్షలకు చేరాయి.

మరో రెండు ట్రోఫీలతో పాటు కొత్త కారు

మరో రెండు ట్రోఫీలతో పాటు కొత్త కారు

మరో రెండు ట్రోఫీలు, ఒక నూతన కారు గెలుచుకున్న ఈ పోర్చుగల్ ప్లేయర్.. హాలీవుడ్ స్టార్ హీరో జాసన్ స్టాథమ్ తో పటీ పడ్డాడు. ఇక ట్విట్టర్‌లో అమెరికా జిమ్నాస్టిక్స్ సిమొన్స్ బైల్స్ ముందు స్థానంలో నిలవగా మాంఛెస్టర్ యునైటెడ్ మాజీ ప్లేయర్ రొనాల్డో 4.86 లక్షల లైక్ లు పొందాడు. ఫేస్ బుక్ షేరింగ్, లైక్స్, కామెంట్స్‌లోనూ రొనాల్డో ముందున్నాడు. రొనాల్డో తన కెరీర్ లో 2016 అత్యుత్తమమైందని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+