కెమెరాలన్నీ ఆమె వైపే.. స్టేడియంలో మెరిసిన 'గ్లామర్ స్టార్'! (వీడియో)
ఫిఫా ప్రపంచకప్ 2026లో బ్రెజిల్ జట్టు తన మొదటి మ్యాచ్‌ను మొరాకోతో ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే సోషల్ మీడియాలో ఓ పేరు విపరీతంగా ట్రెండ్ అవ్వడం మొదలైంది. ఆ పేరే బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ భాగస్వామి 'బ్రూనా బియాంకార్డి'. న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య బ్రూనా తన గ్లామరస్ లుక్, స్టైలిష్ కాన్ఫిడెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. కెమెరాల ఫోకస్ పదే పదే ఆమెపైనే పడటంతో, అభిమానులు ఆమెను ఏకంగా 'వరల్డ్ కప్ క్వీన్' అంటూ కొనియాడడం ప్రారంభించారు.
బ్రెజిల్ రంగుల డ్రెస్సులో అదిరిపోయే ఫోటోషూట్
మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ ప్రత్యేక ఫోటోషూట్‌లో బ్రూనా బ్రెజిల్ జాతీయ జెండా రంగుల స్ఫూర్తితో రూపొందించిన ఓ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయింది. ఈ డ్రెస్‌తో పాటు నెయ్‌మార్ ఫేమస్ 'నెంబర్ 10' జెర్సీని కూడా ఆమె తనదైన శైలిలో ఫ్లాంట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో ఆమె ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. బ్రెజిల్ మ్యాచ్ గెలవడానికి ముందే బ్రూనా అందరి మనసులను గెలిచేసిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఫ్లోరిడా నుంచి నెయ్‌మార్ ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో బ్రెజిల్ జట్టుకు సపోర్ట్ చేయడానికి నేరుగా న్యూయార్క్ చేరుకుంది.

గాయపడిన నెయ్‌మార్.. స్టేడియంలో ఫ్యామిలీ మూమెంట్స్
మరోవైపు మోకాలి గాయం కారణంగా స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ తరఫున మైదానంలోకి దిగలేకపోయాడు. అయినప్పటికీ తన జట్టును ప్రోత్సహించడానికి ఆయన స్టేడియానికి వచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం పిచ్ పక్కన నెయ్‌మార్, బ్రూనాతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి కొన్ని సరదా క్షణాలను పంచుకున్నారు. నెయ్‌మార్ కెరీర్‌లో ఫ్రాన్స్, సౌదీ అరేబియా ప్రయాణాల నుంచి.. ఆయన గాయపడి ఇబ్బంది పడుతున్న కఠిన సమయాల వరకు బ్రూనా ఎల్లప్పుడూ ఆయనకు అండగా నిలిచింది. కాగా అక్టోబర్ 2023లో ఈ జంటకు 'మావియే' అనే కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే.
నెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న గ్లామర్ తడాఖా!
ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న బ్రూనా బియాంకార్డి గతంలోనూ పలుమార్లు వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి వరల్డ్ కప్ లాంటి మహా వేదికపై ఆమె ఇచ్చిన ఎంట్రీ, టోర్నమెంట్‌లోనే అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ ఫ్యాన్‌గా ఆమెను నిలబెట్టింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో గోల్స్, పాస్‌లు లేదా స్కోర్‌లైన్ల కంటే ఎక్కువగా బ్రూనా వైరల్ లుక్స్ గురించే చర్చ నడుస్తోంది. అటు బ్రెజిల్ ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో నెయ్‌మార్ త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలని కోరుకుంటూనే.. ఈ గ్లామర్ జోడిని చూసి మురిసిపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications