Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు: అత్యాచార ఆరోపణలను ఖండించిన నెయ్‌మార్‌

Neymar denies rape allegations in Instagram video showing messages shared with accuser

హైదరాబాద్: బ్రెజిల్‌ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెలలో పారిస్‌లో నెయ్‌మార్ అత్యాచారానికి పాల్పడినట్లు... ఈ మేరకు అతడిపై ఫిర్యాదు అందినట్లు సావో పౌలో పోలీసులు పేర్కొన్నారు. కాగా, తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలను నెయ్‌మార్‌ ఖండించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇదంతా పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన కుట్ర అని నెయ్‌మార్ ఆరోపిస్తూ ఏడు నిమిషాల నిడివి కలిగిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ మహిళ తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నదని, ఆమెతో ఫ్రెండ్లీగా జరిపిన వాట్సాప్‌ మెసేజ్‌లను కూడా నెయ్‌మార్ వీడియోలో చూపించాడు.

నెయ్‌మార్‌తో ఆ మహిళ బెడ్‌పై టాప్ లెస్‌గా ఉన్న ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసని, తన వద్ద నుంచి బలవంతంగా డబ్బు గుంజేందుకే ఆమె ఈ నాటకం ఆడుతున్నట్టు ఆరోపించాడు. విచారణలో నిజా నిజాలను నిగ్గుతేలతాయని నెయ్ మార్ ఈ సందర్భంగా కోరాడు.

కాగా, మే 15న అత్యాచారం జరిగినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బ్రెజిల్‌కు చెందిన మహిళ కావడంతో ఆమెకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇనిస్టాగ్రామ్ ద్వారా నెయ్‌మార్‌కు దగ్గరైనట్లు తెలుస్తోంది. దీంతో నెయ్‌మార్ గత మే నెలలో ఆమెను పారిస్‌కు ఆహ్వానించాడు.

కాగా, ఇద్దరూ ఇష్టపడే సెక్స్‌లో పాల్గొన్నారని నెయ్‌మార్ తండ్రి చెప్పాడు. అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన కొడుకును బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని నెయ్‌మార్‌ తండ్రి సాంతోస్‌ తెలిపాడు.

Story first published: Monday, June 3, 2019, 13:55 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+