సాకర్ చరిత్రలో అద్భుతం: నెయ్‌మార్ కోసం రూ. 1677 కోట్లు
హైదరాబాద్: ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ చరిత్రలోనే శుక్రవారం ఓ అద్భుతం చోటు చేసుకుంది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధికంగా రూ.1677 కోట్లు చెల్లించి పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) జట్టు బార్సిలోనా నుంచి నెయ్‌మార్‌ను కొనుగోలు చేసింది. దీంతో నెయ్‌మార్ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌కు గుడ్‌బై చెప్పాడు.
బ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ ప్రొఫెషనల్ లీగ్స్‌లో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెయ్‌మార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది. తాజా ఒప్పందంతో ఇకపై అతడు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు.
నెయ్‌మార్ ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ. 1677 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది.

ఏడాదికి రూ. 336 కోట్లు వేతనంగా
2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెయ్‌మార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. సాకర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఒప్పందం. అంతేకాదు నెయ్‌మార్ ప్రపంచంలో అత్యధిక మొత్తం తీసుకోనున్న ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు.

నెయ్‌మార్‌కి 10వ నంబర్ జెర్సీని కేటాయించిన నెయ్‌మార్
నెయ్‌మార్ ఇక తమ ఆటగాడని పీఎస్‌జీ జట్టు ప్రకటించింది. శుక్రవారం పారిస్ చేరుకున్న నెయ్‌మార్ పీఎస్‌జీతో చేరనున్నాడు. పీఎస్‌జీ జట్టు నెయ్‌మార్‌కి 10వ నంబర్ జెర్సీని కేటాయించింది. ఇప్పటివరకు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీ రికార్డు పాల్ పోగ్బా (ఫ్రాన్స్) పేరిట ఉంది.

పోగ్బా రికార్డుని అధిగమించిన నెయ్‌మార్
గతేడాది మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 785 కోట్లు) జువెంటాస్ క్లబ్ (ఇటలీ)కి చెల్లించి పోగ్బాను కొనుగోలు చేసింది. తాజాగా నెయ్‌మార్ ఈ రికార్డును నెయ్‌మార్ అధిగమించాడు. పీఎస్‌జీతో ఒప్పందం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని నెయ్‌మార్ అన్నాడు.

సంతోషంగా ఉందన్న నెయ్‌మార్
శుక్రవారం విలేకరుల సమావేశంలో నెయ్‌మార్ మాట్లాడుతూ 'యూరోప్ వచ్చినప్పటి నుంచి పీఎస్‌జీ క్లబ్‌ను గమనిస్తున్నాను. ఇది ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇస్తోంది' అని అన్నాడు. కొత్త సహచరులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని నెయ్‌మార్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications