న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

2019లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అథ్లెట్ ఎవరో తెలుసా?

Neymar, Alex Morgan among most searched athletes on Google in 2019

హైదరాబాద్: 2019లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అథ్లెట్‌గా అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ఆంటోనియో బ్రౌన్ నిలిచాడు. మరోవైపు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయమ్మార్ రెండో స్థానంలో నిలవగా... ఆమెరికాకు చెందిన మరో స్టార్ ప్లేయర్ అలెక్స్ మెర్గాన్ ఐదో స్థానంలో నిలిచింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆంటోనియో బ్రౌన్ ఎన్‌ఎఫ్‌ఎల్ దర్యాప్తును కూడా ఎదుర్కొన్నాడు. ఓక్లాండ్ రైడర్స్ నుండి విడుదలైన తరువాత అతడు ఇంగ్లాండ్ పేట్రియాట్స్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పారిస్ జెయింట్ జర్మైన్‌లో చేరినప్పటి నుండి నెయమ్మార్ ఈ ఏడాది మైదానం బయట అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు.

ఫామ్‌లోకి పృథ్వీ షా: బరోడాపై సెంచరీ, మూడో ఓపెనర్‌గా అవకాశం!ఫామ్‌లోకి పృథ్వీ షా: బరోడాపై సెంచరీ, మూడో ఓపెనర్‌గా అవకాశం!

పారిస్ జెయింట్ జర్మైన్‌ బోర్డుతో పాటు అతడి మేనేజర్‌తో సంబంధాలు దెబ్బతినడంతో సమ్మర్‌ ట్రాన్ఫర్ విండో కింద తిరిగి బార్సిలోనా జట్టుకు రావాలని ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. అయినప్పటికీ పారిస్ జెయింట్ జర్మైన్‌ జట్టు తరుపున నెయమ్మార్ అనేక కీలక మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.

ఒలింపిక్ గోల్డ్‌తో పాటు ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో అమెరికా విజయం సాధించడంలో అలెక్స్ మోర్గాన్ కీలకపాత్ర పోషించింది. కాంకాకాఫ్ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డెన్ బూట్ అవార్డును కూడా అలెక్స్ మోర్గాన్ గెలుచుకుంది. ఫ్రాన్స్ 2019 టోర్నీకి యుఎస్ తప్పక అర్హత సాధించాల్సిన మ్యాచ్‌లో ఏడు గోల్స్‌తో మెరిసింది.

క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచిన లంక పేసర్ ఇసురు ఉడాన (వీడియో)క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచిన లంక పేసర్ ఇసురు ఉడాన (వీడియో)

అలెక్స్ మోర్గాన్ టీమ్ మేట్, బాలోన్ డీ ఓర్ విజేత మేగాన్ రాపిన్ కూడా 2019లో అత్యధిక మంది శోధించిన టాప్-10 అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జులైలో మహిళల పుట్‌బాల్ వరల్డ్ కప్ గెలిచిన అమెరికా జట్టుకు మేగాన్ రాపిన్ కెప్టెన్‌గా వ్యవహారించింది.

Story first published: Wednesday, December 11, 2019, 16:53 [IST]
Other articles published on Dec 11, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X