For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EURO 2024: సెమీస్‌లో నెదర్లాండ్స్

యూరో కప్‌లో సెమీఫైనల్స్‌లో తలపడే జట్లు ఏంటో తేలిపోయాయి. క్వార్టర్ ఫైనల్‌లో టర్కీపై నెదర్లాండ్స్ 2-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. జులై 11న సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. జులై 10 జరగనున్న మరో సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ పోటీపడనుంది.

నెదర్లాండ్స్-టర్కీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి అర్ధభాగంలో టర్కీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సమేత్ అకైడిన్ హెడర్ ద్వారా గోల్ సాధించాడు. అయితే రెండో అర్ధభాగంలో నెదర్లాండ్స్ పుంజుకుంది. 70వ నిమిషంలో స్టెఫాన్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. అయితే మెర్డ్ ముల్దుర్ సెల్ఫ్ గోల్‌తో నెదర్లాండ్స్ 2-1తో విజయం సాధించింది.

Netherlands Stage Dramatic Comeback to Beat Turkey 2-1 in UEFA Euro 2024 Quarter-Final

స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లండ్ పెనాల్టీ షూటౌట్‌లో 5-3తో గెలిచి సెమీస్‌కు చేరింది. అయితే ఇంగ్లండ్‌కు స్విట్జర్లాండ్ గట్టిపోటీని ఇచ్చింది. మ్యాచ్‌ను అంత సులువుగా స్విస్ వదులుకోలేదు. ఇంగ్లండ్ కంటే ముందే స్విట్జర్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. 75వ నిమిషంలో బ్రీల్ ఎంబోలో గోల్ కొట్టి స్కోరు ఖాతా ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ గొప్పగా పుంజుకుంది. అయిదు నిమిషాలకే గోల్ సాధించి స్కోరు సమం చేసింది.

బుకాయో సాకా గోల్ సాధించి ఇంగ్లండ్‌ను పోటీలోకి తెచ్చాడు. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిసేసరికి ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. ఇందులో ఇంగ్లండ్ 5-3తో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. కాగా, యూరో కప్ ఫైనల్ జులై 15న జరగనుంది.

Story first published: Sunday, July 7, 2024, 12:49 [IST]
Other articles published on Jul 7, 2024
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+