కీ ప్లేయర్స్ లేనేలేరు.. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ టీం

హైదరాబాద్: రష్యాలో సాకర్ కప్ సంరంభానికి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫుట్‌బాల్‌తో సంబంధం ఉన్న దేశాలన్నీ రష్యాకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నాయి. స్పానిష్ లీగ్ 'లా లీగా' జెయింట్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన సొంత దేశం పోర్చుగల్ జట్టుకు సారథ్యం వహించనున్నారు. కానీ పోర్చుగల్ సమాఖ్య సగం మంది ప్లేయర్లు లేకుండానే జట్టును ఎంపిక చేసింది. యూరో 2016 ఫైనల్స్‌లో జట్టు విజయానికి గోల్ చేసిన సెంటర్ ఫార్వర్డ్ ఎడర్ వంటి ఆటగాళ్లకు టీంకు దూరం పెట్టారు కోచ్ ఫెర్నాండో శాంటోస్.

పోర్చుగల్ జట్టుకు రొనాల్డో కెప్టెన్సీ:
యూరోపియన్ ఛాంపియన్లల్లో గోల్స్ చేసిన ఆల్ టైమ్ రికార్డు చేసిన క్రిస్టియానో రొనాల్డో జట్టుకు సారథ్యం వహించనున్నారు. తొలి రౌండ్‌లో స్పెయిన్, మొరాకో, ఇరాన్ జట్లతో పోర్చుగల్ తలపడనుంది. పోర్చుగల్ జట్టులో ఇంకా గోల్ కీపర్‌గా రుయి పాట్రిసియో, సెంట్రల్ డిఫెండర్లు పెపె, బ్రూనో ఆల్వెస్, మిడ్ ఫీల్డర్లు విలియమ్ కార్వాల్హో, జోవో మౌంటిన్హో, ఫార్వార్డ్ రికార్డో ఖ్వారెస్మా కూడా ఎంపికయ్యారు.

మంచి ప్లేయర్లతో తుది జట్టు ఎంపిక క్లిష్టమే
పోర్చుగల్ కోచ్ ఫెర్నాండేజ్ శాంటోస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘23 మంది తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. ఒక నిపుణుడిగా నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిని మెప్పించలేనని నాకు తెలుసు' అని తెలిపాడు. వ్యక్తిగతంగా యూరోపియన్ చాంపియన్ షిప్ టోర్నమెంట్లలో పాల్గొన్న ప్లేయర్లను పక్కన బెట్టడం తనకు మానసికంగా తట్టుకోవడం కష్ట సాధ్యమేనన్నారు.

ఇది పోర్చుగల్ టీం..
ఫెర్నాండో శాంటోస్ ఎంపిక చేసిన 23 మంది ఆటగాళ్లలో పది మంది రష్యా సాకర్ సంరంభానికి దూరం కానున్నారు. ఎడర్ వంటి సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్‌తోపాటు మిడ్ ఫీల్డర్లు ఆండ్రే గోమ్స్, రెనాటో సాంచెస్, ఫార్వర్డ్ నానీ, డిఫెండర్ ఎలిసియూ తదితర ప్లేయర్లు జట్టుకు దూరం కానున్నారు.
గోల్ కీపర్స్ : ఆంటోనీ లోప్స్, బెటో, రుయి పాట్రిసియో
డిపెండర్లు: బ్రూనో ఆల్వేస్, సెడ్రిక్ సోర్స్, జోస్ ఫాంటే, మారియో రుయి, పెపె, రాఫెల్ గౌర్రెరో, రికార్డో పెరీరా, రుబెన్ డయాస్.
మిడ్ ఫీల్డర్లు: ఆండ్రియన్ సిల్వా, బ్రూనో ఫెర్నాండెజ్, జోయో మారియో, జోయో మౌంటిన్హో, మాన్యుయల్ ఫెర్నాండెజ్, విలియమ్ కార్వాల్హో.
ఫార్వర్డ్ ప్లేయర్లు: ఆండ్రీ సిల్వ, బెర్నాండో సిల్వ, క్రిస్టియానో రొనాల్డో, జెల్సన్ మార్టిన్స్, గొంకాలో గౌడెస్, రికార్డో క్వారెస్మా.

మంచి ప్లేయర్లను వదులుకోవడం కష్టమే
‘ఎడర్, నానీ వంటి ప్లేయర్లను వదులుకోవడం కష్ట సాధ్యమే. వారంతా పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు. కానీ నేను ఆయా ఆటగాళ్లలో మెరుగైన వారిని ఎంపిక చేయడం నా బాధ్యత' అని ఫెర్నాండో శాంటో పేర్కొన్నారు. యూరోపియన్ చాంపియన్స్ టోర్నమెంట్లలో ఆడిన ప్లేయర్ల కంటే గట్టి జట్టును ఎంపిక చేశానని తాను చెప్పలేనని ఫెర్నాండో శాంటోస్ తెలిపాడు. కానీ ఇతర జట్ల కంటే మెరుగైన జట్టునే ఎంపిక చేశానని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications