ముంబై: వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న జాన్ అబ్రహాం ఫ్రాంచైసీ 'నార్త్‌ఈస్ట్ యునైటెడ్' క్లబ్ జట్టును ముంబై సిటీ ఎఫ్‌సి కెప్టెన్ డియాగో ఫోర్లాన్ ఇంద్రజాలం అడ్డుకట్ట వేస్తుందా? ఆ జోరులోనే పడిపోతుందా? అన్న సంగతి తేలనున్నది. పుణె సిటీతో
పుణెలో జరిగిన మ్యాచ్‌లోనే శుభారంభాన్ని అందుకుని మరో విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నది ఫోర్లాన్ నేతృత్వంలోని ముంబై జట్టు.
ఐఎస్‌ఎల్ 3 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో తన సొంతగడ్డపైనే కేరళ బ్లాక్‌బస్టర్స్‌ను 1 - 0, ఎఫ్‌సి గోవా జట్టును 2 - 0 స్కోర్లతో తేడాతో మట్టి కరిపించిన నార్త్‌ఈస్ట్.. రెండు విజయాలందించిన విశ్వాసం మెండుగా ఉన్నా.. ముంబైలో జరిగే మ్యాచ్‌లో ఫోర్లాన్,
తదితరుల మ్యాజిక్‌ను నియంత్రించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
'మేము చాలా మంచి జట్టుపైనే విజయం సాధించాం. ఈ సీజన్ టైటిట్ కోసం పోటీ పడుతున్న జట్లలో పుణె ఒకటి. గేమ్ మా పక్షాన నిలవడంతో మేం తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించాం. ప్రారంభ మ్యాచ్‌లోనే గెలుపు చక్కని సొగసునందిస్తుంది. క్రీడాకారులకు

మంచి పరిపుష్టి కలిగిస్తుంది' అని ముంబై సిటీ ఎఫ్‌సి కోచ్ అలెగ్జాండ్రే గౌమారేస్ తెలిపారు.
వారు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినందున మేం చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. తొలి మ్యాచ్‌లో పుణెపై విజయానికి తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించి.. కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఫోర్లాన్‌పైనే అందరి దృష్టి పడింది. పుణెతో
తొలి మ్యాచ్‌లో మాదిరిగానే నార్త్‌ఈస్ట్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఫోర్లాన్ కొంత అలర్ట్‌గా ఉండాల్సి రావచ్చు.
'మేం అఫెన్స్‌లో పరిష్కారాలు వెతుకుతున్నాం. స్కోర్ బోర్డును పరుగెత్తించేందుకు డియాగోనే అన్ని బాధ్యతలు నిర్వహించకూడదని భావిస్తున్నాం. ప్రీ సీజన్‌లో మా టాప్ స్కోరర్ గాస్టన్ సంగోయ్ గాయపడటం మాకు విచారకరం. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో
ఆడేందుకు సోనీ (నోర్డె) వెళ్లిపోతున్నారు' అని ముంబై కోచ్ అలెగ్జాండ్రె గౌమారెన్ అన్నారు. తమకు ఉన్న గొప్ప ఆటగాళ్లతోనే మరోసారి పోటీ పడాల్సి ఉందని, మ్యాచ్‌లో బలహీనతల నుంచి బయట పడాల్సి ఉన్నదని చెప్పాడు.
ఇక రెండు విజయాలతో జట్టు సభ్యులు జోరు మీదున్నా.. కోచ్ వింగాడ మాత్రం అప్పుడే గెలిచినట్లు భావించొద్దని ప్లేయర్లను హెచ్చరించారు. ముంబైతో ఆడే మ్యాచ్ చాలా కష్టమని, ముంబై ప్లేయర్లను ముప్పుతిప్పలు పెట్టే వ్యూహం అమలు చేయాలన్నాడు. ఏ
లీగ్‌లోనైనా తొలి మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకమని వింగాడ వ్యాఖ్యానించాడు. మేము గెలుపుకోసం అన్ని వ్యూహాలు సిద్ధంచేశాం. పలు అవకాశాలు సృష్టించడమే దీనికి కారణమన్నాడు.
రణబీర్‌కపూర్ సహ - యజమానిగా గల ముంబై సిటీ గత రెండేళ్లలో లీగ్‌దశలోనే చతికిల పడినా.. కోచ్ అలెగ్జాండ్రే గౌమారెస్ శిక్షణలో ఈ దఫా పునరుత్తేజం పొందింది. పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో గెలుపునకు విదేశీ ఆటగాళ్ల అటాకింగ్ కీలకం.
ఇదిలా ఉంటే సునీల్‌ఛెత్రి, లాల్చౌన్మావాయియా ఫనాయి, ఉదాంగ సింగ్, అమరీందర్ సింగ్.. వంటి సీనియర్ ఆటగాళ్లు బెంగళూరు తరఫున ఐ - లీగ్‌లో ఆడేందుకు వెళుతుండటం ముంబై సిటీకి ఇబ్బందికరమైనా సమర్థులైన ఆటగాళ్లు దండిగానే ఉన్నారు.
హైతీయన్ నోర్డె స్థానే జాకీచంద్‌సింగ్ అందుబాటులోకి రానున్నాడు. సొంత గడ్డపై అభిమానుల మధ్య ఆడుతున్న ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి కానున్నది.