Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: పెనాల్టీతోనూ మేలే, ఫోర్లాన్‌ మాయాజాలం

ముంబై: నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌పై ముంబై సారధి డియాగో ఫోర్లాన్‌ మాయాజాలమే పై చేయి సాధించింది. ముంబైలో రెండు జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో 55వ నిమిషంలో పెనాల్టీ రూపంలో తనకు వచ్చిన చిన్నపాటి అవకాశాన్ని ఫోర్లాన్‌ సద్వినియోగం చేసుకోవడంతో ముంబై సిటీ విజయం సాధించింది.

ఇరు జట్లు మ్యాచ్‌పై పట్టు కోసం హోరాహోరీగా పోరాడినా జాన్‌ అబ్రహం జట్టు హ్యాట్రిక్‌ విజయం సాధనకు ముంబై సిటీ చెక్‌ పెట్టింది. ఈ పరిస్థితుల్లో నార్త్‌ఈస్ట్‌ మరిన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలంటే కోచ్‌ నెలోవింగాడ తన తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముంబై సిటీ శిక్షకుడు అలెగ్జాండ్రీ గౌమారెస్‌ తన టీంపై పూర్తి విశ్వాసం పెట్టుకుని బరిలో దిగడం గమనార్హం.

మ్యాచ్‌ తొలి హాఫ్‌లో ఇరు జట్లు తమ శక్తియుక్తుల ప్రదర్శనకే సమయం ఇచ్చాయి. కాకపోతే వరుసగా రెండు విజయాలతో జోష్‌లో ఉన్న నార్త్‌ఈస్ట్‌ కాస్త మ్యాచ్‌ను ఎంజాయ్‌చేసిందీ అంది వచ్చిన అవకాశాలను మిస్‌చేసుకున్నది. నార్త్‌ఈస్ట్‌ మిడ్‌ఫీల్డర్లు ఆటలో ప్రత్యర్థి జట్టు గోల్‌ ఎలా చేస్తున్నారన్న విషయమై స్పష్టత వ్యవహరించాల్సి ఉన్నది.

ప్రత్యేకించి ఫోర్లాన్‌ వంటి వారు ప్రమాదకర పరిస్థితుల్లో గోల్‌ చేస్తున్నప్పుడు నార్త్‌ఈస్‌ గోల్‌కీపర్‌ జోకోరో తన స్వభావ సిద్ధమైన పద్ధతులతోనే ప్రత్యర్థి జట్టును ఎదుర్కోవడం సాధ్యం అవుతుంది. మ్యాచ్‌ ముగియడానికి చివరి ఐదు నిమిషాల్లో నికోలస్‌ వెలేజ్‌ బంతిని స్లిప్‌లోకి పంపినప్పుడు పెనాల్టీగా మార్చి గోల్‌ చేసేందుకు గల అవకాశాన్ని జపానీస్‌ కుర్రాడు స్తుమి యుసా, అల్ఫారో చేజేతులా వదిలేశారు.

Mumbai end NorthEast’s perfect record with a 1-0 win at home

కెప్టెన్‌ ఫోర్లాన్‌ తనదైన శైలిలో టీంను లీడ్‌చేస్తే.. గోల్స్‌ సాధనలో వెనుకబడ్డ నార్త్‌ఈస్ట్‌.. స్కోర్‌ సమయంచేయడానికి అన్ని ప్రయత్నాలుచేసింది. కానీ జాన్‌ అబ్రహం జట్టు అవకాశాలన్నీ అధిగమించి ఫోర్లాన్‌ సేన వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నది.

ఫస్ట్‌ హాఫ్‌లో నార్త్‌ఈస్ట్‌కు చెందిన స్ట్రైకర్‌ రోమరిక్‌ 11వ, 21వ నిమిషాల్లో గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలను ఉరుగ్వేయన్‌ టీం విజయవంతంగా తిప్పికొట్టింది.

నార్త్‌ఈస్ట్‌ ఓటమిని కోచ్‌ వింగాడ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడటంతోపాటు తమ జట్టు మరికొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉన్నదని గుర్తించాడు. అత్యంత తేలిగ్గా పెనాల్టీని గోల్‌గా మార్చి విజయం సాధించినందుకు ముంబై సిటీ ఎఫ్‌సిని అభినందించాడు.

తన జట్టు కుర్రాళ్లు పొరపాట్లుచేసినా, అవకాశాలు జార విడిచినా వాళ్ల ఆటతీరు గర్వ కారణమని అన్నాడు. ఫుట్‌బాల్‌ వంటి ఆటలో మానవ మాత్రులకు పొరపాట్లు తప్పవని వింగాడ వేదాంత ధోరణి ప్రదర్శించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగంచేసుకుంటే ఫలితం మెరుగ్గా ఉండేదన్నాడు.

ముంబై సిటీ కోచ్‌ అలెగ్జాండ్రీ గౌమారెస్‌ మాట్లాడుతూ ప్రీ సీజన్‌లో తాము కష్టపడి చేసిన ప్రాక్టీస్‌కు ఫలితం కనిపిస్తున్నదన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడొచ్చు, మరికొన్నిసార్లు ఆడలేకపోవచ్చు గానీ ఇది క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నాడు.

సొంతగడ్డపై ప్రాక్టీస్‌ చేయడంతో తమ జట్టు విజయం సాధించి ఉండవచ్చునని, కానీ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలంటే తాము మరింత సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని గౌమారెస్‌ వ్యాఖ్యానించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం శుభారంభమేనన్నాడు. గత ఏడాది ఐఎస్‌ఎల్‌ రెండో ఎడిషన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి క్లబ్‌ ఆరో స్థానంతో సంతృప్తి చెందింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+