
హైదరాబాద్: వరుస పరాజయాలతో విసిగిపోతున్న ఢిల్లీ డైనమోస్ జట్టును ముంబై జట్టు మళ్లీ చతికిల పడేసింది. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా ముంబైలోని స్పోర్ట్స్ ఎరెనా స్టేడియంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్ జట్లు తలపడ్డాయి. వరుస ఓటమిల తర్వాత గెలవాలని ఆశపడి ఆటమొదలెట్టిన ఢిల్లీ జట్టు ఖాళీ చేతులతోనే వెనుదిరిగింది.
ఈ మ్యాచ్ ముంబై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుచుంది. ఢిల్లీ మాత్రం చివరి నుంచి ముందు స్థానంలో ఉంది. ఢిల్లీ గోల్ కీపర్ అర్నబ్ దాస్ శర్మను ఛాలెంజ్ చేస్తూ లూసియన్ గోయెన్ చేసిన గోల్‌తో ముంబై జట్టు స్కోరును మొదలెట్టింది.
ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శనకు ఈ ఆటంతా ముంబై జట్టు చేతిలోకి వచ్చినట్లైంది. వరుసగా నాలుగు గోల్స్ చేసి ఢిల్లీని మట్టి కరిపించింది. ఇదే లీగ్‌లో ఇప్పటి వరకు ముంబై స్టార్ స్ట్రైకర్ బల్వంత్ సింగ్ చేసిన ఐదు గోల్‌లు రికార్డు సృష్టించాయి. ఎమన్నా 78వ నిమిషంలో చేసిన గోల్‌తో లీగ్‌లో అధిక గోల్‌లు చేసిన క్రీడాకారుడిగా నమోదయ్యాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.