సెమీస్‌లో ముంబైకర్లు: డిఫెన్స్‌లో చెన్నైయిన్
ముంబై: ముంబైకర్లు రెచ్చిపోయారు. డియాగో ఫోర్లాన్ సారధ్యంలో, అలెగ్జాండ్రి గుమారెస్ శిక్షణలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 3 ఎడిషన్‌లో రికార్డు నెలకొల్పారు. గత రెండుసార్లు లీగ్ దశకు మాత్రమే పరిమితమైఇంటిదారి పట్టిన ముంబై జట్టు ఈ సీజన్‌లో మాత్రం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2 - 0 తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
హోరాహోరీగా పోరాడిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నైజట్టు గోల్ చేయడంలో వైఫల్యంతో ఓటమి పాలైంది. ముంబై కీలక ఆటగాళ్లు సునీల్ ఛెత్రి, డిఫెడిరికో, కెప్టెన్ డియాగో ఫోర్లాన్ త్రయం మరోసారి జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. మాటియాస్ డెఫెడెరికో 32వ నిమిషంలో, క్రిస్టియాన్ వాడొక్జ్ 60వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించడంతో ముంబై విజయం ఖరారైంది.
కొద్ది సేపటి వరకు ఇరు జట్లు పరస్పరం దూసుకెళ్లినా అవకాశాలు కల్పించుకోకుండానే ముందుకు సాగిన తర్వాత గానీ మ్యాచ్‌కు లైఫ్ రాలేదు. 13వ నిమిషంలో ముంబై సిటీ సారధి డియాగో ఫోర్లాన్ ఔట్ సైడ్ నుంచి పంపిన బంతి గోల్ పోస్ట్ వెనుక నుంచి వెళ్లిపోయింది. దాన్ని తిరిగి డెఫెడెరికో పెనాల్టీ కార్నర్‌గా మార్చి సునీల్ ఛెత్రికి పంపినా చెన్నైయిన్ గోల్ కీపర్ కరంజిత్ సింగ్ విజయవంతంగా అడ్డుకున్నాడు.

ఫోర్లాన్ సేన మ్యాచ్ అద్యంతం బంతిపై పట్టు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచింది. 32వ నిమిషంలో స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి.. లెఫ్ట్ వైపు నుంచి లవ్లీ బాల్ ను డెఫెడెరికోకు పంపాడు. అక్కడ నుంచి డెఫెడెరికో బంతిని నేరుగా గోల్ పోస్ట్ దారి మళ్లించడంతో ఐఎస్ఎల్‌లో గోల్స్ సంఖ్య సెంచరీకి చేరుకోగా. డెఫెడెరికోకిది మొదటి గోల్ కావడం గమనార్హం.
ముంబై గోల్ సాధించడంతో చెన్నైయిన్‌పై ఒత్తిడి పెరిగింది. 37వ నిమిషంలో రాఫెల్ అగస్టో పంపిన బంతిని ముంబై గోల్ కీపర్ అమరిందర్ సింగ్ నేరుగా అడ్డుకున్నాడు. ఫస్టాఫ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఇరు జట్లకు కొన్ని అవకాశాలు లభించినా గోల్ సాధించలేకపోయాయి. ప్రత్యేకించి ముంబై సారధి డియాగో ఫోర్లాన్ ఫ్రీ కిక్ ద్వారా నేరుగా పంపిన బంతిని కరంజిత్ అడ్డుకోవడంతో నేరుగా గోల్ పోస్ట్ గోడ మీదుగా బయటకు వెళ్లిపోయింది. ఫస్టాఫ్ ముగిసే సరికి చెన్నైయిన్‌పై ముంబై 1 - 0 స్కోర్ తేడాతో ఆధిపత్యం సాధించింది.
2-0 స్కోర్‌తో సెమీస్‌కు ముంబై సీల్
పస్టాఫ్ మాదిరిగానే సెకండాఫ్‌లో 60వ నిమిషం వరకు ఏ జట్టుకూ అవకాశం లభించలేదు. ఫోర్లాన్ క్రాస్ గా వచ్చిన బంతిని రైట్ సైడ్ నుంచి వాడోక్జ్ కు పంపాడు. తద్వారా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాడోక్జ్ బంతిని నెట్ లోకి పంపి రెండో గోల్‌తో మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించాడు.
డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ నిజంగానే పలు అవకాశాలను గోల్స్‌తో చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. విధాన నిర్ణయాత్మక అవకాశాలేవీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 79వ నిమిషంలో ఫోర్లాన్ తెలివిగా బెర్నాండ్ మెండీకి పంపిన బంతిని చివరిక్షణంలో చెన్నైయిన్ గోల్ కీపర్ కరంజిత్ సింగ్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే సునీల్ ఛెత్రి మరో నిమిషంలోనే మూడో గోల్ సాధించేందుకు విఫలయత్నంచేశాడు.
చెన్నైయిన్ జట్టుకు 85వ నిమిషంలో డేవిడ్ సుక్కీ రూపంలో సదవకాశం వచ్చినా ఆశ్చర్యకరమైన రీతిలో క్రాస్ బార్ మీదుగా దూసుకెళ్లిపోయింది. 89వ నిమిషంలో ముంబైకి మూడో గోల్ చేసే అవకాశం లభించింది. ఫోర్లాన్ పంపిన బంతిని థియాగో చున్హా కుడి వైపు నుంచి గోల్ పోస్ట్ కు పంపితే చెన్నైయిన్ కరంజిత్ సింగ్ దిగ్విజయంగా అడ్డుకున్నాడు. దీంతో చివరి అవకాశం తేలిపోయింది. 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించడంతోపాటు సెమీస్ కు ముంబై జట్టు ప్లేస్ ఖరారైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications