Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర మారలేదు: చెన్నైతో ముంబై మ్యాచ్ డ్రా

చెన్నై: చెన్నైయిన్ జట్టును దాటి ముందుకెళ్లలేక సతమతమైన ముంబై సిటీ.. స్కోర్ సమంచేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తద్వారా చెన్నై చేతిలో నాలుగు వరుస ఓటముల రికార్డు నుంచి బయటపడింది. అంతేకాదు టాప్ 4లో చెన్నై చేరకుండా అడ్డుకున్నది.

మ్యాచ్ అసాంతం ముంబైపై చెన్నైయిన్ ఆధిపత్యం కొనసాగింది. మూడు పాయింట్లు సాధించాలన్న తపన, ఆర్తితో చెన్నైయిన్ కుర్రాళ్లు చురుగ్గా స్పందించారు. మ్యాచ్ ముగియడానికి ముందు బ్రెజిలియన్ లియో కోస్తా గోల్ చేయడంతో ముంబై గెలుపొందకపోయినా ఒక పాయింట్ సాధించింది.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

22 వేల మందికి పైగా అభిమానులు హాజరైన ఈ మ్యాచ్‌లో ఫస్టాఫ్ ఎటువంటి గోల్ చేయకుండానే ముగిసిపోయింది. కానీ బుధవారం జరిగిన మ్యాచ్‌లో నాలుగింట మూడొంతులు ఆధిపత్యం ప్రదర్శించడం, మరోవైపు చెన్నైయిన్ తన డిఫెన్స్‌ను యథాతథంగా కొనసాగించడంలో తొలిదశలో గోల్స్‌కు అవకాశం చిక్కలేదు.

సందర్శక ముంబై కుర్రాళ్లు చెన్నైయిన్ వ్యూహంలోకి చొచ్చుకు వెళ్లలేకపోయినా.. చెన్నై మాత్రం తమ ప్రత్యర్థి జట్టులోని ఫార్వర్డ్ ప్లేయర్లను దాటుకుని, ఇరువైపులా ఆధిపత్యం కొనసాగిస్తూ ముందుకు సాగింది. 51వ నిమిషంలో చెన్నైయిన్ సంచలనం జెజె లాల్పెఖ్లౌ కార్నర్ నుంచి కొట్టిన షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌కు చేరిపోయింది.

 Mumbai City FC's scrappy point against Chennaiyin FC had the hallmarks of a top team

88వ నిమిషంలో ముంబై ప్లేయ్ లియో కోస్తా 30 అడుగుల దూరం నుంచి నేరుగా బంతిని గోల్ పోస్ట్ కు పంపడంతో స్కోర్ సమమైంది. మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాలకే చెన్నై జెర్రీ లాల్రింజౌలా దూరం నుంచి కొట్టిన షాట్ నేరుగా ముంబై గోల్ కీపర్ అల్బినో గోమ్స్ చేతిలో పడింది.

మౌరిజియో పెలుసో మరో 17 నిమిషాలకు డేంజరస్ ఏరియా నుంచి ఫ్రీ కిక్ రూపంలో పంపిన బంతిని ముంబై గోల్ కీపర్ విజయవంతంగా నిలువరించాడు. పెలుసో 31వ నిమిషంలో కొట్టిన మరో గోల్ షాట్ వైడ్‌గా మారి బంతి గోల్‌పోస్ట్ ఆవల పడింది. మరోవైపు ముంబై ఫస్టాఫ్ ముగియడానికి తొమ్మిది నిమిషాల ముందు సారధి డియాగో ఫోర్లాన్ గోల్ చేసేందుకు వచ్చిన అవకాశం మిస్సయింది.

కానీ బంతి గోల్ పోస్ట్ మీదుగా క్రాస్ ఓవరై పోయింది. దీంతో చెన్నై గోల్ కీపర్ దువాయ్నే కెర్ర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇరు పక్కలా ప్రత్యర్థి జట్టును ఎదుర్కొనేందుకు ముంబై సిటీ తొలి నుంచి తన కంపాక్ట్ షేప్ వ్యూహాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే థాయిసింగ్, మౌరిజియో పెలుసో దూసుకొచ్చినప్పుడు ముంబైకర్లు కష్టపడాల్సి వచ్చింది.

చెన్నై సంచలనం జెజె లాల్ఫైఖ్లౌ దాడిని ఎదుర్కొన్న ముంబై సెంటర్ బ్యాక్ జంట లుసియాన్ గోయాన్, అన్వర్ అలీ తమ జాబ్ చాలా చక్కగా పూర్తిచేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ మీడియాతో మాట్లాడుతూ మ్యాచ్ ఫస్టాఫ్‌లో తమ కుర్రాళ్ల పెర్పార్మెన్స్ బాగానే ఉందని, మ్యాచ్ పై పట్టు కొనసాగించారన్నారు.

చెన్నై కుర్రాళ్లు గోల్స్ సాధించేందుకు అవకాశాలు ఉన్నా వారు కొట్టిన రెండు షాట్లు పెద్ద ప్రమాదకారిగా లేవన్నాడు. ముంబైకర్లు పూర్తిగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ జట్టును నిలువరించడానికి అన్ని శక్తియుక్తులు ప్రయోగించారు. సోనీ నోర్డె నుంచి వచ్చిన ముప్పును ఎదుర్కోగలిగారు.

సెకండాఫ్‌లో చెన్నైయిన్ రంగంలోకి దింపిన దుదు ఒమాంగ్బేమీతో ముంబై డిఫెన్స్ ను నిలువరించడంలో పూర్తిగా విజయం సాధించలేకపోయాడు. మ్యాచ్ పున: ప్రారంభమైన ఆరు నిమిషాల వ్యవధిలో జెజె గోల్ సాధించకుండా దుదు నిలువరించలేకపోయాడు. స్థానిక ఫ్యాన్స్ దన్నుతో చెన్నైయిన్ కుర్రాళ్లు దూకుడుగా ముందుకు వెళ్లారు.

చెన్నై కుర్రాళ్లలో గల విశ్వాసంతో మ్యాచ్ పరిస్థితి ఒకింత క్లిష్టంగా మారింది. జాకీచంద్ సింగ్ ను రంగంలోకి దించడంతో చెన్నై దాడితో ఏకాకులు కాకుండా ముంబై నిలబడగలిగింది. మరోవైపు లియో కోస్తా మధ్యలో చెన్నై కుర్రాళ్లు మ్యాచ్ పై పట్టు సాధించకుండా నిలువరించగలిగాడు.

ఇరు జట్లకు గోల్స్ చేసుకునే అవకాశాలు ఉన్నా ముందుకెళ్లలేకపోయాయి. 70వ నిమిషంలో ముంబై సొంత కారణాల వల్ల బంతిపై పట్టు కోల్పోవడంతో చెన్నై డిఫెన్స్ స్వాధీనంచేసుకున్నది. జెజె తెలివిగా దుదుకు బంతిని అందించినా గోల్ కీపర్ వద్ద నిలిచిపోయింది.

మరోవైపు ముంబై సిటీకి 75వ నిమిషంలో బంగారం లాంటి అవకాశం వచ్చినా అదనంగా తోసికొచ్చినా ఒత్తిడి ఇబ్బందుల పాల్జేసింది. 77వ నిమిషంలో ఫోర్లాన్ కొట్టిన కిక్.. చెన్నైయిన్ కుర్రాళ్లను కంగారు పెట్టినా గోల్ పోస్ట్ దరికి చేరలేదు. 75 నిమిషాల వరకు చెన్నైయిన్ మ్యాచ్ పై పట్టును కొనసాగించడం ఒక భాగమైతే తర్వాత ముంబై సిటీ పుంజుకుని మాటరాజ్జీ శిష్యులను దీటుగా ఎదుర్కొన్నది.

చివరి 15 నిమిషాల్లోనే ముంబై ప్లేయర్లు చెలరేగిపోయారు. 88వ నిమిషంలో ముంబై కుర్రాడు చేసిన గోల్ తో రెండు జట్ల స్కోర్లు సమమైంది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని డ్రా గా ముగించగలిగింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+