Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అమ్మ చెప్పిందని హ్యట్రిక్‌తో జట్టును గెలిపించా'

Mum wanted me to score hat-trick against East Bengal in Kolkata Derby: Mohun Bagan's Dipanda Dicka

హైదరాబాద్: ఏసర్ దీపందా డిక్కా ఆదివారం మోహన్ బగన్ జట్టుకు హీరో అయ్యాడు. అమ్మ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని ఐ లీగ్ లో తన జట్టును అత్యుత్తమ స్కోరు దిశగా నడిపించాడు. ఈస్ట్ బెంగాల్‌తో మోహన్ బగన్ జట్టు తలపడి 2-0 పాయింట్లతో గెలిచింది.

మ్యాచ్ జరగడానికి ముందురోజు దీపందాకు అతని తల్లి దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. ఆమె మాట్లాడుతూ ఈస్ట్ బెంగాల్‌పై హ్యాట్రిక్ విజయం సాధించమని చెప్పిందంట. ఈ విషయాన్ని దీపందానే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. 'నేను ఈ మ్యాచ్‌లో ఫెయిలైతే నన్ను జట్టుకు దూరంగా ఉంచాలని జట్టు యజమానులు నిర్ణయించుకున్నారు. ఇవే మాటలు మా అమ్మకు చెప్పాను. ఆమె నా ప్రదర్శన కంటే జట్టు గెలుపే ముఖ్యం. అదీ నీ వల్ల రావడం ఇంకా ప్రశంసనీయం. అని చెప్పడంతో నాకు మంచి ప్రేరణ దొరికింది.' అని అతను వివరించాడు.

మ్యాచ్ అనంతరం వాళ్ల అమ్మకు బహుకరించేందుకు గాను దీపంద డిక్కా ఓ షాలువాను కొన్నాడట. ఈ విజయంతో ప్రశంసలతోనూ, బహుమతులతోనూ వస్తున్న అభిమానులను ఆపడం అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూరిటీ గార్డుల వల్లనూ కాలేదు.

దీపందాను ఇదే లీగ్‌లో ఏడు గోల్‌లు చేయడానికి గల రహస్యం ఏంటని అడిగితే దానికి అతను చెప్పిన సమాధానం. కోల్‌కత్తాలోని తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కతో కాలక్షేపం చేయడమే అని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 16:12 [IST]
Other articles published on Jan 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+