
కోహ్లీ సేన ఘన విజయం
బాలీవుడ్‌కు చెందిన ఆల్ స్టార్స్‌తో ఆదివారం జరిగిన సెలెబ్రిటీ క్లాసికో చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వంలోని ఆల్ హార్ట్స్ 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని రెండు గోల్స్‌తో ఆల్ హార్ట్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్ కోహ్లీ, కేదార్ జాదవ్ చెరో గోల్ చేశారు.
బెక్‌హామ్ తరహాలో గోల్ చేసిన ధోని
ఆట మొదలైన ఐదో నిమిషంలోనే గోల్ చేసిన ధోని ఆల్ హార్ట్స్‌కు శుభారంభం ఇచ్చాడు. బెక్‌హామ్ తరహాలో రెండు చూడముచ్చటైన ఫ్రీ కిక్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. ఆ తర్వాత 39వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను మరోసారి నెట్‌లోకి పంపిన ధోని జట్టును 2-0తో ఆధిక్యంలో నిలబెట్టాడు.
ధోని చేసిన గోల్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే
ధోని చేసిన గోల్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ కూడా రెండు గోల్స్ సాధించాడు. మరోవైపు 57వ నిమిషంలో రణ్‌బీర్ కపూర్ గోల్ చేయడంతో ఆల్ స్టార్స్ ఎట్టకేలకు రేసులోకొచ్చింది.
92వ నిమిషంలో గోల్ చేసిన కోహ్లీ
87వ నిమిషంలో కేదార్ జాదవ్ గోల్ కొట్టగా.. 92వ నిమిషంలో కోహ్లీ గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లతో పాటు టెన్నిస్ ప్లేయర్ బోపన్న, హాకీ కెప్టెన్ శ్రీజేశ్ కూడా ఆల్ హార్ట్స్ జట్టు తరఫున ఆడారు.


Click it and Unblock the Notifications













