Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్కాటిష్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన మోర్టాన్

స్కాటిష్ గ్యాస్ స్కాటిష్ కప్‌లోని అయిదో రౌండ్‌లొ మధర్‌వెల్ జట్టుపై మోర్టాన్ 2-1 తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఆరంభంలోనే రాబీ ముయిర్ కార్నర్ నుంచి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అతడి ఇన్‌స్వింగర్ షాట్‌ను లియామ్ కెల్లీ అడ్డుకున్నాడు.

ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 1-0తో ఆతిథ్య జట్టు ఆధిప్యత్యం చెలాయించింది. మథర్‌వెల్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. వీస్తున్న గాలులను సద్వినియోగం చేసుకుని దూకుడుగా ఆడుతూ పైచేయి సాధించింది. విరామం తర్వాత జార్జ్ ఓక్లే మోర్టన్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.మరోవైపు మథర్‌వెల్ జట్టు పోటీలోకి ఆలస్యంగా వచ్చింది. అంతేకాకుండా గొప్పగా ప్రతిఘటించలేకపోయింది.

Dougie Imrie

సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన జాక్ వాలే 85వ నిమిషంలో గోల్ కొట్టి మథర్‌వెల్ జట్టు ఖాతా తెరిచాడు. కానీ మోర్టాన్‌కు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరకుండా అడ్డుకోలేకపోయాడు. ఈ క్లబ్‌లో మోర్టాన్ క్వార్టర్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

అయితే మదర్‌వెల్ గత ఆరు సీజన్‌లలో కప్ పోటీలలో నాలుగుసార్లు మోర్టన్‌ను ఓడించింది. అంతకుముందు 2015లో లీగ్ కప్‌లో చివరిసారిగా ఓటమిపాలైంది. ఆ సమయానికి బారాక్లాగ్ సారథిగా ఉన్నాడు. ఆ తర్వాత అతడి బాధ్యతలు ముగిశాయి. కాగా, ఇరు జట్లు వరుసగా అయిదు విజయాలు సాధించి బరిలోకి దిగాయి. మరోవైపు మోర్టాన్‌కు ఇది వరుసగా 12వ గెలుపు. మదర్‌వెల్‌తో పోలిస్తే రెట్టింపు విజయాలు అందుకుంది.

కాగా, మదర్‌వెల్ కెప్టెన్ కెల్లీ మ్యాచ్ ప్రారంభంలో గాలులతో కూడిన ఈ పరిస్థితులతో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. ఒక గోల్ కిక్‌ను పార్క్ నుండి బయటకు తన్నాడు. ఆ తర్వాత మోర్టాన్ నుంచి తీవ్రపోటీ పెరిగింది. 35వ నిమషంలో, 55వ నిమిషంలో మోర్టాన్ గోల్స్ సాధించింది. మరోవైపు చివరి 10 నిమిషాల్లో మదర్‌వెల్ చెలరేగింది. దూకుడుగా ఆడుతూ వరుసగా గోల్స్‌కు ప్రయత్నించింది. కానీ మోర్టన్ డిఫెన్స్ దృఢంగా నిలవడంతో స్కోరు సమం చేయలేకపోయింది.

Story first published: Saturday, February 10, 2024, 17:07 [IST]
Other articles published on Feb 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+