Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొరాకోకు 2026 సాకర్ కప్ ఆతిథ్య హక్కులు అనుమానమే?

Morocco into 2026 World Cup vote despite stadium, infrastructure fears

హైదరాబాద్: అరుదైన అవకాశం పొందాలని కలలు కన్న ఆఫ్రికా దేశం మొరాకోకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు ఆతిథ్య హక్కులు పొందేందుకు మొరాకో దాఖలు చేసిన బిడ్‌ను ముందుగానే ఫిఫా పాలక మండలి తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొరాకోకు పోటీగా అమెరికా ప్లస్ మెక్సికో ప్లస్ కెనడాలతో కూడిన కూటమి పోటీ పడుతుండగా స్టేడియాల నిర్మాణం, మౌలిక వసతులను కల్పించడంలో మొరాకో వెనుకబడి ఉంది. ఆటగాళ్ల రవాణా 'హై రిస్క్'తో కూడుకున్న వ్యవహారమని, వసతుల కల్పన కష్టమని ఫిఫా తనిఖీ అధికారులు తయారుచేసిన నివేదిక రెండు రోజుల క్రితం బహిర్గతమైంది.

ఫిఫా తనిఖీ అధికారుల నివేదిక ప్రకారం అర్హతల ప్రాధాన్యంలో మొరాకో ఐదింటికి 2.7 పాయింట్లు మాత్రమే పొందింది. ప్రత్యర్థిగా ఉన్న అమెరికా కూటమి నాలుగు పాయింట్లతో ముందంజలో ఉన్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న మాస్కోలో జరిగే ఫిఫా పాలక మండలి సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంతోపాటు ప్రత్యర్థి బిడ్డర్ల నుంచి ప్రశ్నలు తలెత్తనుండటంతో ముందస్తుగానే '2026 ఫిఫా వరల్డ్ కప్' ఆతిథ్య హక్కులను మొరాకోకు అప్పగించొద్దని ఫిఫా పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 మొరాకోలో వాస్తవ పరిస్థితులు ఇలా

మొరాకోలో వాస్తవ పరిస్థితులు ఇలా

మొరాకోలో వాస్తవ పరిస్థితులను విస్మరించలేమని ఫిఫా తనిఖీ అధికారుల నివేదిక పేర్కొంది. స్టేడియంల నుంచి శిక్షణా శిబిరాలు, వసతుల ప్రాజెక్టుల వరకు అన్ని రిస్కుతో కూడుకున్నవేనని, పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నదని వివరించింది. ఫిఫా నిర్దేశిత 20 కేటగిరీల్లో 17 విభాగాల్లో అమెరికా బిడ్‌తోనే రిస్క్ తక్కువ అని, మొరాకో బిడ్ ప్రకారం ఏడు కేటగిరీల్లో మాత్రమే రిస్క్ అని తెలిపింది.

వసతుల కల్పనలో అమెరికా కూటమి బిడ్ బెస్ట్

వసతుల కల్పనలో అమెరికా కూటమి బిడ్ బెస్ట్

2026 ఆతిథ్య హక్కుల కోసం పోటీ పడుతున్న అమెరికా కూటమి.. మొరాకో కంటే వసతుల కల్పనలో చాలా ముందు ఉంది. అత్యాధునిక దేశాల కూటమిగా అమెరికా దాని మిత్ర దేశాల్లో తళుకులీనే అందాలు, అతిపెద్ద సామర్థ్యం గల స్టేడియాలు, మౌలిక, రవాణా వసతులు ఫిఫా పాలక మండలిని ఆకర్షించాయి. మొరాకో ఆతిథ్య హక్కుల కోసం గట్టిగా పోటీ పడినా, యూరప్ సభ్య దేశాలతో సమానంగా ముందంజలో ఉన్నా ప్రయోజనం లేకపోయింది.

2010లో దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్యం

2010లో దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్యం

ఇప్పటివరకు 2010లో తొలిసారి దక్షిణాఫ్రికా ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. మొరాకో బిడ్‌ వైభవంగా కొనసాగనుంది. 2010లో ఖతార్ కప్ అర్హతల విషయంలో ఇలాగే జరిగింది. 2022 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల బిడ్ కోసం పోటీ పడుతున్న ఖతార్‌.. ప్లేయర్లు, ప్రేక్షకులు, అధికారులకు ప్రతికూల వాతావరణం నెలకొందని ఫిఫా తనిఖీ అధికారుల నివేదిక పేర్కొంది.

 అమెరికా బిడ్‌కే ఫిఫా అనుకూలం?

అమెరికా బిడ్‌కే ఫిఫా అనుకూలం?

అనూహ్యంగా ఖతార్ దేశానికి 2022 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు దఖలు పరుస్తూ 207 దేశాలతో కూడిన ఫిఫా పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. తొలిసారిగా 2026 వరల్డ్ కప్‌లో 48 జట్లు పాల్గొననున్నాయి. ఇదిలా ఉంటే 2026 ఆతిథ్య హక్కుల విషయమై అమెరికా కూటమి బిడ్‌కే గియాన్నీ ఇన్‌ఫాంటినో ఓటేయడానికి ఒక కారణం ఉంది. మరోవైపు ప్రపంచ కప్ అర్హతల బిడ్ గెలుచుకోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణకు రిఫరెండంగా పరిగణిస్తున్నారు. గత ఏప్రిల్‌లో తమ బిడ్‌కు అనుకూలంగా ఓటేయకుంటే జాగ్రత్త అని ఫిఫా సభ్య దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇంతకుముందు కూడా మొరాకో 1994, 1998, 2006, 2010 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కుల కోసం పోటీ పడుతోంది.

Story first published: Sunday, June 3, 2018, 14:12 [IST]
Other articles published on Jun 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+