Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడేళ్లలో రెండో టైటిల్‌పై మొలీనా ‘ఐ’

ముంబై: అట్లెటికో డి కోల్‌కతా హెడ్ కోచ్ జోస్ మొలీనా మూడేళ్లలో రెండోసారి జట్టుకు ఐఎస్ఎల్ టైటిల్ సాధించి పెట్టడంపైనే ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరించాడు. కోల్‌కతాలో జరిగిన ముంబై జట్టుతో తొలి సెమీ మ్యాచ్‌లో ఎటికె 3 - 2 స్కోర్ తో విజయం, మంగళవారం ముంబైలో గోల్ రహిత డ్రాగా ముగించి ఫైనల్‌గా టైటిల్ పోరుకు సిద్ధమైంది.

ఫస్టాఫ్‌ ముగింపుకు రెండు నిమిషాల ముందు రాబర్ట్ లాల్‌థ్లామౌనాను ఫౌల్స్ కారణంగా రిఫరీ రెడ్ కార్డు చూపడంతో ఎటికె జట్టు 10 మందితోనే మ్యాచ్ ముగించాల్సి వచ్చింది. దీంతో మాస్టర్ క్లాస్ డిఫెన్స్ ఆట ప్రదర్శించి లీడ్‌ను కాపాడుకున్నది. ఈ నేపథ్యంలో ఎటికె హెడ్ కోచ్ జోస్ మొలీనా స్పందిస్తూ జట్టుకు కోచ్‌గా తొలి ఏడాది ఎటికె టీంను మూడేళ్లలో రెండోసారి ఫైనల్స్ తీసుకెళ్లిన క్రెడిట్ పొందానన్నాడు.

'నాకు తెలిసినంత వరకు అట్లెటికో డి కోల్ కతా జట్టు కుర్రాళ్లంతా మంచి పని చేశారని భావిస్తున్నా. జట్టు కుర్రాళ్లు, మేనేజ్మెంట్ ఉమ్మడి లక్ష్యం గోల్ సాధించడమే. జట్టుకు చెందిన ప్రతి ఒక్కరూ సరైన దిశలో ప్రయాణం సాగించారు. క్లబ్‌కు చెందిన ప్రతి ఒక్కరు అన్ని స్థాయిల్లోనూ కొంత మంచిగా వ్యవహరించారు. ఒకింత మెరుగ్గా స్పందించారు. ఎటికె మూడేళ్లలో మూడుసార్లు సెమీ ఫైనల్స్, రెండోసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఇప్పుడు రెండోసారి టైటిల్ సాధించేందుకు ప్రయత్నిస్తాం' అని జోస్ మొలీనా తెలిపాడు.

11 మందితో ఆడటానికే ప్రాధాన్యం

11 మందితో ఆడటానికే ప్రాధాన్యం

లాల్‌థ్లామౌనా మ్యాచ్ నుంచి మధ్యలో పంపేయడంపై స్పందిస్తూ తాను నిజాయితీగా చెబుతున్నానని, ఎల్లవేళలా 11 మందితో ఆడటానికే ప్రాధాన్యం ఇస్తానన్నాడు. కానీ ఈనాడు పది మంది ప్లేయర్లతో ఆడాల్సి వచ్చినా డిఫెన్సివ్ వ్యూహం అనుసరిస్తూ ముంబైకి అవకాశాలు లభించకుండా నిలువరించగలిగామని అన్నాడు.

ఫస్టాఫ్‌లో ముంబై సారధి సునీల్ ఛెత్రికి

ఫస్టాఫ్‌లో ముంబై సారధి సునీల్ ఛెత్రికి

ఫస్టాఫ్‌లో ముంబై సారధి సునీల్ ఛెత్రికి ప్రారంభంలో కొన్ని నిమిషాల వరకు గోల్స్ చేసేందుకు స్పేస్, అవకాశాలు వచ్చాయన్నాడు. తొలి 20 - 25 నిమిషాల్లో తాము కంఫర్ట్ బుల్‌గా ఆడనే లేదన్నాడు. రాబర్ట్‌ను ఆంక్షలతో బయటకు పంపాక మ్యాచ్ తీరే మారిపోయిందని మొలీనా వ్యాఖ్యానించాడు. సెకండాఫ్‌లో తాము కలిసికట్టుగా ఉమ్మడి వ్యూహం అనుసరించడంతో ముంబై జట్టును నిలువరించామని అన్నాడు.

ఫైనల్స్ మ్యాచ్ కోసం బెంచ్‌కే పరిమితం

ఫైనల్స్ మ్యాచ్ కోసం బెంచ్‌కే పరిమితం

సారథి హెల్డర్ పొస్టిగ, అటాకింగ్ ప్లేయర్ ఇయాన్ హుమ్, సమీగ్ దౌటీ వంటి ప్రధాన ఆటగాళ్లంతా ఫైనల్స్ మ్యాచ్ కోసం బెంచ్‌కే పరిమితమయ్యారు. కోచ్ మొలీనా సలహా మేరకు స్టార్ ప్లేయర్లందరినీ పక్కన బెట్టేశారు. పొస్టిగ, మొలీనాలు బెంచ్ వద్ద నుంచే ఆడుతున్న వారికి సలహాలిస్తూ ముందుకు నడిపించారు. అయితే ఫైనల్స్ మ్యాచ్ లో ఏయే జట్లు ఆడతారు? ప్లేయర్లు ఎవరెవరు బరిలోకి దిగుతారన్నది తనకు తెలియదన్నాడు.

కొందరు ప్లేయర్లకు పరిస్థితి మరింత ఇబ్బందికరం

కొందరు ప్లేయర్లకు పరిస్థితి మరింత ఇబ్బందికరం

కానీ ముంబైతో జరిగిన మ్యాచ్ కోసం ప్రయాణం సాగించడంతో రెస్ట్ లేకుండా పోయిందన్నాడు. కొందరు ప్లేయర్లకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉన్నదన్నాడు. దీంతో ముంబైతో జరిగిన రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ నెల 18న జరిగే ఫైనల్స్ పోరులో మరింత మెరుగైన జట్టుతో ఆడగలమని భావిస్తున్నామన్నాడు. టైటిల్ కోసం జరిగే పోరులో ఫీల్డ్‌లో పరస్పరం ఇరు జట్ల కుర్రాళ్లు హోరాహోరీ పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదన్నాడు. తమ ప్రత్యర్థి ఎవరో తామిప్పుడే ఏమీ చెప్పలేమన్నాడు.

ఉత్తమ జట్టు చేతిలోనే ఓటమి పాలయ్యామన్న గుమారెస్

ఉత్తమ జట్టు చేతిలోనే ఓటమి పాలయ్యామన్న గుమారెస్

సెమీ ఫైనల్స్‌లో తాము ఉత్తమ జట్టు చేతిలో ఓటమి పాలయ్యామని ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు. తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కోల్‌కతా జట్టు చేతిలో ఓటమి పాలైన తర్వాత ముంబైలో పోటాపోటీగా జరిగే మ్యాచ్ లో విజయావకాశాలు ఉన్నా ఒత్తిడి వల్ల విఫలమయ్యామని అన్నాడు. తాము ప్రస్తుత సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించామని చెప్పాడు.

మంచి ఆటతీరు ప్రదర్శించారు

మంచి ఆటతీరు ప్రదర్శించారు

తమ కుర్రాళ్లు మంచి ఆటతీరు ప్రదర్శించినందుకు గర్వంగా ఉన్నదని, దురద్రుష్టవశాత్తు తమ కుర్రాళ్లకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. సెమీ పైనల్స్ మ్యాచ్‌లో తాము పటిష్ఠమైన, సమర్థమైన జట్టుతో తలపడుతున్నామన్న సంగతి తెలుసునన్నాడు. ఈ సీజనంతా తమ కుర్రాళ్ల ఆటతీరును ఎంజాయ్ చేశారన్నాడు. కానీ ఫైనల్స్‌లో అడుగుపెట్టలేకపోవడం డిజప్పాయింట్ చేసిందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+