ఆఫ్రికన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్‌గా మొహ్మద్ సలాహ్

హైదరాబాద్: ఆఫ్రికన్ ఫుట్‌బాల్ క్రీడాసమితి (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్) విడుదల చేసిన ర్యాంకుల జాబితా ఆధారంగా మొహ్మద్ సలాహ్ 2017 సంవత్సరానికి గాను ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న సలాహ్ మాట్లాడుతూ.. నాకెప్పుడూ ఇదే స్థాయిలో ఉండాలనుంటుంది. దీని కోసం నేను రిస్క్‌లు తీసుకోవడానికైనా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. చరిత్రలో ఈజిప్ట్ క్రీడాకారుడిగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిలో నేను ఉండాలని తాపత్రయపడుతున్నానని ఆయన తెలిపాడు.
పన్నెండు నెలలుగా సలాహ్ అంతర్జాతీయ క్లబ్‌లో ఆడుతున్నాడు. దీనికి గాను ఆయన 317 కోట్ల ఒప్పందానికి సంతకం చేశాడు. గతేడాది జరిగిన ఆఫ్రికా కప్ ఫైనల్ లోనూ ఆడి 2-1 తేడాతో మ్యాచ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications