ఫిఫా వరల్డ్ కప్ 2018: సలాహ్.. వచ్చేశాడు

హైదరాబాద్: ప్రపంచ కప్‌పై ఎన్ని ఆశలు ఉన్నా.. కొంత నిరుత్సాహంతోనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్న ఈజిప్టు జట్టుకు శుభ పరిణామం రానే ఎదురైంది. ఇటీవల గాయంతో చికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న సలాహ్ ప్రపంచ కప్‌లో ఆడతాడా అనే సందేహాలు నెలకొన్నాయి. అలాంటిది బుధవారం జట్టుతో కలిసి శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడంతో మళ్లీ ఆ జట్టు ఊపిరందుకుంది.
గత నెల ఛాంపియన్స్‌లీగ్ ఫైనల్ సందర్భంగా అతని భుజానికి గాయం అవడంతో ప్రపంచకప్‌లో అసలు ఆడతాడో లేదో అనే అనుమానాలు వ్యకమయ్యాయి. అయితే గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న అతను తిరిగి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆ జట్టు కోచ్ ఇహాబ్ లహిత మాత్రం సలా మొదటి మ్యాచ్‌లో ఆడతాడని కచ్చితంగా చెప్పలేమంటున్నాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
'సలాహ్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. కానీ అతను ఉరుగ్వేతో మేం తలపడబోయే తొలిమ్యాచ్‌లో తుది జట్టులో ఉంటాడో లేదో అనే విషయంపై కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. తిరిగి కోలుకుని మాతో ఆడేందుకు సిద్ధమవడం చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆడేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయి. అతణ్ని రోజూ గమనిస్తూనే ఉన్నాం. గతంతో పోలిస్తే అతని చాలా త్వరగా కోలుకుంటున్నాడు. ' అని ఇహాబ్ తెలిపాడు.
ఈజిప్టు తన తొలి మ్యాచ్‌లో శుక్రవారం ఉరుగ్వేతో తలపడనుంది. 44 గోల్స్‌తో ఈ సీజన్‌లో లివర్‌పూల్ తరపున సలా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదే లీగ్‌లో సలాహ్ భుజం గాయం కారణంగా కన్నీటితో మైదానాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత లివర్‌పూల్‌తో పోరాడిన రియల్ మాడ్రిడ్ ఓటమికి గురైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications